పక్షవాతంతో జీవితం ముగిసినట్టేనా?

కన్ను మూసి తెరిచే లోగా జరిగి పోతుంది.క్షణ కాలంలో మీ జీవితం మారిపోతుంది. అసలు పక్షవాతం అంటే--మెదడు లోపలి ధమనుల ద్వారా మెదడుకు వెళ్ళే రక్త  ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే పక్ష వాతం అని అంటారు. మీరు మాట్లాడే శక్తినికోల్పో వచ్చు,ఆలోచించగలిగే శక్తిని కోల్పో వచ్చు.కాలు చెయ్యి  పడిపోవచ్చు అదేపక్షవాతం  పక్ష వాతాన్ని వైద్య పరిభాషలో అపోప్లేక్టిక్ స్ట్రోక్ అంటారు. అమెరికాలో మనుష్యుల్ని మృత్యువు దగ్గరికి చేరుస్తున్న ప్రమాద కర జబ్బులలో  గుండె జబ్బులు క్యాన్సర్,తరువాత పక్ష వాతం మూడో స్థానం లోకి వస్తుంది. అమెరికాలో ప్రతిసంవత్సరం షుమారు అరమిలియను మందికి పక్షవాతం బారిన  పడుతున్నారని ఒక అంచనా.వాళ్ళలో లక్షా యాభై వేలమంది కి పైగా మృత్యు వాత  పడుతున్నారు.బతికి ఉన్నవాళ్ళు కూడా ఎదో ఒక శారీరక లోపంతోజీవిస్తున్నారని తెలుస్తోంది. మాటపడిపోవడం.దృష్టిలోపం,జ్ఞాపకశక్తి,లేకపోవడం లేదా శరీరలో ఒక పక్క ఎదో ఒక భాగం  చచ్చుబదిపోవడం లాంటి ఎదో ఒక అవలక్షణం తో జీవితాన్ని వెళ్ళ దీస్తున్నారు.

పక్షవాతం అంటే ఏమిటి?

డాక్టర్స్ దీనిని సెలబ్రెల్ ఎమర్జెన్సీ కింద చెబుతారు. సెలేబ్రెల్ అంటే మెదడు అర్ధం ఏమర్గెంచి అంటే ఆకస్మికం అని అర్ధం లేదా అకస్మాత్తుగా వచ్చిందని అర్ధం. మెదలోపలి ధమనుల ద్వారా మెదడుజు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే స్ట్రోక్ పక్షవాతం. రక్త ప్రవాహానికి ఆటంకం కలగాదమనేది ధమనిలోని ఎదో భాగాన రక్తం  గడ్డకట్టడం బ్లడ్ క్లోట్ మూలంగా కావచ్చు. లేక దమని చిట్లడం మూలంగా ను కావచ్చు. దమని ద్వారా మెదడుకు వెళ్ళే రక్తం మెదడుకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందిస్తుంది.మెడకు రక్త సరఫరా  ఆగిపోగానే ఆక్సిజన్ సరఫరా కూడా ఆగిపోతుంది.ఆక్సిజన్ సరఫరా లేక పోయేసరికి మెడకు ఉక్కిరి బిక్కిరి  అవుతుంది.అపుడు మెడకు చెందిన విలువైన కణజాలం నసిన్చిపోతాయి.లేక సీరియస్ గా డ్యామేజ్ అవుతాయి. ఈ డామేజ్ జరగడానికి కేవలం నాలుగు లేదా ఐదు నిమిషాలు చాలు అంతే. మెడకు వెళ్ళేసరఫరా కి నాలుగు  ఐదు నిమిషాలు అవరోధం ఏర్పడితే చాలు పక్ష వాతం వచ్చేస్తుందన్న మాట. ఇలా డామేజ్ అయిన మెదడు కణాలు మీ ఎడమ చేతిని పని చేయించేవి అయితే మీ ఎడమ చేయి పడిపోతుంది. జ్ఞాపక శక్తిని కొంత్రోల్ చేసేవి అయితే జ్ఞాపక శక్తిని కోల్పోతారు.ఒకవేళ  మెదడు తాలూకు అత్యధిక కణజాలం నశిస్తే అమనిశే చనిపోతాడు. ఆకస్మికంగా రక్త సరఫరా ఆగిపోవడం స్ట్రోక్ అనేది అప్పటికిఅప్పుడు ఆరోగ్యంగా ఉన్న దమనుల లో ఏమి ఆగదు. ఏళ్ల తరబడి డ్యామేజ్ అయిన ధమనులలో మాత్రమే జరుగుతుంది.

స్ట్రోక్/లేదా పక్షవాతం ఎలా ఏర్పడుతుంది.--ఎన్నిరకాలు ---- సేలేబ్రెల్  త్రంబోసిస్----

మెడకు వెళ్ళే రక్త నాళాలలో ఎక్కడో ఒక చోట రక్తం గడ్డ కడుతుంది.ఇలా రక్తం గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లోట్ అంటారు దీనిని వైద్య పరిభాషలో త్రోమ్బోస్ అంటారు.క్రమేణా ఈ క్లోట్ పెద్దదై రక్తాన్ని పూర్తిగా మూసేస్తుంది.

--- రక్తనాళాలలో ఏర్పడ్డ త్రోమ్బోస్ ని ప్రారంభంలోనేగుర్తిస్తే  రక్తనాళాన్ని పూర్తిగా మూసేయకుండా ఉండే విధంగా ఉండడానికి తగిన మందుల ద్వారా చికిత్స చేయవచ్చు.

సెలబ్రల్ ఏమ్బాలిజం...

మరేదో శరీరం నుండి కొట్టుకు వచ్చిన రక్తపు గడ్డ లేదా నరేదైనా ముక్క గాని ఉంటె దానిని ఎమోలుస్ అంటారు.మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనిలో ఇరుక్కుపోయి రక్త సరఫరాకి ఆటంకాన్ని కలిగిస్తుంది.

సెలేబ్రల్ హేమరేజ్...

మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళం ఏదైనా చిట్లి నప్పుడు ఆ ప్రాంతం నుండి రక్తం బయటకు చిమ్మి లీక్ అవుతుంది. ఏదైనా ట్యూమర్ లాంటిది  మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్త నాళాన్ని అదిమి పెట్టి నప్పుడు ఆ నాళం మూసుకుపోయి మెడకు వెళ్ళే రక్తం  ఆగిపోతుంది.ఈ నాలుగు సందర్భాలలోనూ వ్యక్తికి పక్ష వాతం వచ్చే అవకాసం ఉంది.