ఇలా క్లీన్ చేస్తే ల్యాప్టాప్ మిలమిలా మెరుస్తుంది..!
posted on Sep 9, 2024 10:13AM
ల్యాప్టాప్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి. దీని వల్ల ల్యాప్టాప్ జీవితకాలం పెరుగుతుంది. ల్యాప్టాప్ శుభ్రంగా ఉంటే దానికి ఎలాంటి ఫిజికల్ సమస్యలు రావు. ల్యాప్టాప్ ను శుభ్రంగా ఉంచుకుంటే దుమ్ము,ధూళి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షణ ఉండటమే కాకుండా ల్యాప్టాప్ కొత్తదానిలా కూడా ఉంటుంది. కొన్ని సులభమైన చిట్కాలతో ల్యాప్టాప్ ను శుభ్రం చేసుకోవచ్చు.
ల్యాప్టాప్ ను క్లీన్ చేసేముందు ల్యాప్టాప్ ను ఆఫ్ చేయాలి. పవర్ కార్డ్ ఉంటే దాన్ని కూడా తొలగించాలి. ఇది డేటాకు రక్షణ ఇస్తుంది.
స్క్రీన్ ను శుభ్రం చేయడానికి మైక్రో పైబర్ క్లాత్ ను ఉపయోగించాలి. స్క్రీన్ మీద నేరుగా నీటిని కానీ ఏదైనా లిక్విడ్ కానీ వేయకూడదు.
కీబోర్డ్ శుభ్రపరచడానికి వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి. కీబోర్డ్ లో అంటుకున్న దుమ్ము, ధూళిని తొలగించడానికి మౌత్ పిక్ లేదా మృదువైన క్లాత్ ను కూడా ఉపయోగించవచ్చు.
ల్యాప్టాప్ స్క్రీన్ మినహా ఇతర భాగాలను శుభ్రం చేయడానికి కొద్దిగా స్పిరిట్, లేదా ఐస్ ఆల్కహాల్ వైప్ లను ఉపయోగించాలి. మిగిలిన ల్యాప్టాప్ ను మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి.
కీబోర్డ్ లేదా స్క్రీన్ ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. ల్యాప్టాప్ లో ఏ వస్తువులను స్క్రాచ్ చేయకుండా ఇది జాగ్రత్తగా ఉంచుతుంది.
ల్యాప్టాప్ లో నీరు చేరితే షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంది. అందుకే నీటితో శుభ్రం చేయడాన్ని నివారించాలి.
ల్యాప్టాప్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ధుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి. ల్యాప్టాప్ మెరుగ్గా ఉంటుంది.
ల్యాప్టాప్ మోడల్ పై దాన్ని శుభ్రం చేసే తీరు ఆధారపడి ఉంటుంది. ల్యాప్టాప్ శుభ్రపరిచే పద్దతులు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ల్యాప్టాప్ మాన్యువల్ ను చదవిన తరువాతే ల్యాప్టాప్ ను శుభ్రం చేయాలి.
*రూపశ్రీ.