జలుబు ఎవరికి వస్తుంది... తగ్గించుకునే సులువైన మార్గాలు

జలుబు వీలాకి మాత్రమే వస్తుంది. వాళ్ళకి రాదు అన్నది కాదు. అందరికీ వస్తుంది ముఖ్యంగా స్చూల్ కి వెళ్ళే పిల్లలకి సంవత్సరానికి 1౦ సార్లు రావచ్చు యుక్త వయస్సులో ఉండే వాళ్ళకి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రావచ్చు నని వైద్యులు పేర్కొన్నారు. స్కూలు కు వెళ్ళే పిల్లలకి జలుబు అధికంగా రావడానికి కారణం ఏమిటి అంటే స్కూల్ లో పిల్లలు ఒక్కొకరు ఒక్కో వైరస్ లకు ఎక్స్పోజ్ అవుతారు పైగా అప్పటికీ వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఇంకా ఉంటుంది.పెరుగు తున్నకొద్ది రోగనిరోదక శక్తి పరి పక్వానికి వచ్చి వాళ్ళు జలుబు వైరస్ ల దాడి ని తట్టుకోగలిగే స్థితికి వస్తారు.

అసలు తేలికగా జలుబు బారిన పడే వాళ్ళు వ్యక్తులు వీళ్ళే....

తాగుబోతులు.పొగతాగే అలవాటు ఉన్నవాళ్లు. వృద్ధులు. బలహీనులు. ఉబ్బసం,బ్రోన్కైల్ ఆస్తమా ఉన్నవాళ్లు. మొదలైన వాళ్ళు అని వైద్యులు గుర్తించారు.

అసలు జలుబు ఎంతకాలం ఉంటుంది?...

జలుబు ఎంతకాలం ఉంటుందనేది,మనిషినుంచి మనిషికి అంటుకున్న వైరస్ ని బట్టి రోగ నిరోధక శక్తిని బట్టి.మారుతూ ఉంటుంది సాధారణంగా జలుబు 2 నుంచి 5 రోజులు ఉంటుంది. కాంప్లికేట్  అయితే వారం లేదా రెండు వారాల దాకా ఉండ వచ్చు.

 జలుబు లక్షణాలు...

మనకు సోకే జలుబులో అధిక భాగపు జలుబు హెడ్ కొల్డ్స్ అంటే ముక్కులోకి,గొంతులోకి అంటి పెట్టుజకుని ఉంటాయి. ఇలాంటి జలుబుప్రధమ లక్షణం గొంతులోనో ముక్కులోనో చిన్నగా తిక్ల్ చేసినట్లు ఉంటుంది. తరు వాత తుమ్ములు,తరువాత ముక్కునుంచి నీళ్ళు కారడం ఉంటుంది.
సాధారణంగా జలుబు వైరస్ మనకు సోకిన 1-2 రోజులకే ప్రారంభ మౌతుంది. ముక్కు లోపల తుమ్ము రాబోతున్న ఇమాజినేషన్,తుమ్ములు,నీరు కారడం,వగైరాలతో,ముక్కు లోపలికి బాక్టీరియా కూడా ప్రవేశించి వుండే పసుపు పచ్చగా చీమిడి కూడా మొదలౌతుంది. ఆ తరువాత నుంచి ఒళ్ళు నొప్పులు,జ్వరం,తలనొప్పి,ఉండోచ్చు.ఇన్ఫెక్షన్ గొంతునుంచి లోపలి ప్రవేశిస్తే గొంతులో,చాతిలో,నొప్పి బరువుగా అనిపిస్తుంది.గొంతు బొంగురు పోవడం పొడి దగ్గు మొదలైనవి ఉంటాయని సాధారణ వైద్యులు చెపుతున్నారు. దగ్గు ప్రారంభంలో పొడిగానే ఉన్న  రోజులు గడుస్తున్న కొద్ది ఇబ్బందికి గురిచేస్తుంది.ముఖ్యంగా రాత్రివేళ మిమ్మల్ని రాత్రివేళ నిద్ర పోనివ్వదు.అంతే కాక మీకు రుచి వాసన తేలీ కుండా పోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో జలుబు మరే తీవ్రమై మధ్య చెవి ఇన్ఫెక్ట్ కావడం జరుగుతుంది. సైను సైటిస్,బ్రాన్ కైటిస్,వాటికీ దారు తీయవచ్చు. అంతకు ముందు ఆస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,చెవిపోటు ఉన్న వాళ్ళు జలుబు వస్తే అంతకు ముందు ఉన్న సమస్యలు ఎక్కువ చేసి 
రోగిని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా జలుబు వల్ల మధ్య చెవి ఇన్ఫెక్ట్ అయినప్పుడుఅది మేనిన్గితిస్ ఎంసిఫిలిటిస్ కు దారి తీయ వచ్చు.దీని వల్ల పరిస్థితి మరింత తీవ్రమై సీరియస్ కండిషన్ ఏర్పడవచ్చు.ఒక్కోసారి అచుట్టుపక్కల భాగాలు ఇన్వొల్వె అయ్యి తల నొప్పి వంతులు మెడ పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి.

జలుబు కొన్ని అపోహలు...

వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది.వర్షంలో తడిస్తే జలుబు రావాలని లేదు.మీరు ఇంట్లో ఉన్న జలుబు చేస్తుంది. ఇంలో ఏమాత్రం తేమ ఉన్న జలుబు వస్తుంది వర్షం కురిసినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారుమీ ఇంట్లో  చెమ్మ వాతావరణం వేడి వాళ్ళ వైరస్ ముక్కును అంటి పెట్టుకుంటుంది. ముద్దు

పెట్టుజుంటే జలుబు చేస్తుంది...

ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది అన్నది 1౦ % కేసులలో ఉండవచ్చు.లాలా జాలం ద్వారా ఒకరినుంచి ఒకరికి జలుబు సోకవచ్చు. ముద్దు పెట్టుకున్నప్పుడు ముక్కులు రెండు దగ్గర అవుతాయి.

చలిలో తెరిగితే జలుబు చేస్తుంది....

మనం చలిలో తరిగితే జలుబు చేస్తుంది అని అనుకుంటాం కాని నిత్యం మంచు ప్రదేసాలలో వుండే వాళ్ళకు జలుబు అంతగా సోకదు. వేడి ప్రదేశాలలో ఉండే వాళ్ళకి జలుబు బాద.

 జలుబును తగ్గించుకునే మార్గాలు...

విటమిన్ సి,పెన్సిలిన్,యాన్తి బాయిటిక్స్ లాంటివి జలుబును తగ్గిస్తాయి.అనుకోడం భ్రమ మాత్రమే.
యాంటి బాయిటిక్స్ బాక్టీరియా మూలంగా ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఉపక రిస్తాయి.తప్ప వైరస్ మూలంగా వచ్చే జలుబు లాంటి అస్వస్థత వద్ద యంటి బాయిటిక్స్ పప్పులు ఏవి ఉడకవు. వ్వితమింక్ మన శరీరంలో ఉండే చెత్తని బయటికి తోలే పని చేస్తుంది.జలుబును పూర్తిగా తొలగించాడు కాని 
వరం రోజులు ఉండే జలుబును రెండు మూడు రోజులు ఉంటుంది. వితమింక్ దగ్గడం,చీదడం లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది.ఇందుకోసం మీరు విటమిన్ సి కల టాబ్లెట్స్ వాడడం కంటే ఆరంజి, ద్రాక్ష, పళ్ళ రసాలను,తాగడం మంచిది.

ఆహారం...

జలుబు చేసినప్పుడు కొవ్వుగల ఆహార పదార్ధం,మాంసం,పాల ఉత్పత్తులు,తక్కువగా తీసుకోండి,
తాజా పళ్ళ రసాలు కయాగూరలు ఎక్కువగా తీసుకోండి.

చికెన్ సూప్...

జలుబు చేస్తే కోడి కూర తినమంటూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.వైద్య పరంగా అది సరైనదే అని అనిపిస్తుంది. ఒక కప్పు వేడి వేడి చికన్ పులుసు మీ ముకు బిరడాని తొలగించి ముక్కులో ముక్కునుంచి పలుచగా నీరు కారడం గమనించ వచ్చు. అది బహుశా కోడి కూరలో వేసిన మూలికలు నషాళానికి చేరి మీ ముక్కును శుభ్రం చేసి ఉంటాయి. ముక్కు కారడం వల్ల మీరు మాటి మాటికీ మీ ముక్కు చీదడం వల్ల మీ శరీరంలోని  సూక్ష్మక్రిములు బయటకు వెళ్లి పోతాయి.

ఉప్పు నీటితో పిక్కిలించండి...

జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం ఉప్పునీతిని గొంతులోపోసి పుక్కులించండి.దీనివల్ల కొంత రిలీఫ్ వస్తుంది.

ఆవిరి పట్టడం...

ఇది మన పూర్వీకుల నుంచి ఆచరిస్తూ అస్తున్న పద్ధతి ఒక గిన్నెలో బాగా మరగ బెట్టిన నీటిని తీసుకుని అందులో కొంత విక్స్ అమృతాంజనం గాని తీసుకుని తలమీద దుప్పటి లేక టవల్ ను కప్పుకుని ఆవిరిని గట్టిగా పీల్చండి జలుబు తాలూకు ముక్కు దిబ్బడ తగ్గుతాయి.

ముక్కుకు వెస్లిన్...

ఇక ఆఖరుగా చీదగా చీదగా ముక్కు వొరుసుకు పోయి మంట పుడుతూ ఉంటుంది పెట్రోలియం జెల్లి ని గని వెస్లిన్ గని ముక్కు చివర పట్టించి కొంచం ముక్కు లోపలి భాగం రాసుకుంటే ఈ బాధ తప్పు తుంది.

బ్రాంది,వైన్....

చాలా మందికి కొంచం జలుబు చేయగానే 3 టీ స్పూన్ల బ్రన్దీని వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే కొంత రిలీఫ్ ఇస్తుంది అంటారు మందు బాబులు.