సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభ ఏర్పాట్ల పరిశీలన

అనంతపురం వేదికగా బుధవారం (సెప్టెంబర్ 10) జరగనున్న  సూపర్ సిక్స్-సూపర్ హిట్' విజయోత్సవ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో  భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సభా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. పర్యవేక్షించారు.  మంగళవారం (సెప్టెంబర్ 8) సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, భద్రతాపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.

ఈ విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందనీ, భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లకూ తావీయవద్దనీ అదికారులకు అనిత ఆదేశాలు ఇచ్చారు.  సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలనీ, అలాగే సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న వంగలపూడి అనిత..  వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా అధి కారులకు  సూచనలు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu