తొక్కిసలాటకు సీఎం ఎలా బాధ్యులౌతారు.. హైకోర్టు

తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా  తొక్కిసలాట జరిగి భక్తుల మరణించిన ఘటనపై దాఖలైన పిల్ లో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, సీఎంలను చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తొక్కిసలాట సంఘటనకు వారు ఎలా బాధ్యులౌతారని పిటిషనర్ ను ప్రశ్నించింది. తిరుపతి తొక్కిసలాట వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై  జస్టిస్‌ కె.సురేశ్‌ రెడ్డి, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  

ఈ ఘటనలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారుకదా అని నిలదీసింది.  రిజిస్ట్రార్ సూచించిన విధంగా పిల్ లో గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రి పేర్లను తొలగించాలని పిటిషనర్ ను ఆదేశించింది.  రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు అనుగుణంగా పిటిషన్ లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.  22వ తేదీకి వాయిదా వేసింది.