పారిస్ ఇంటి తాళాల కోసం వెతికా..  ఐటి దాడులపై తాప్సి కౌంటర్

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటి శాఖ ప్రముఖ హీరోయిన్ తాప్సి. బాలివుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లపై మూడు రోజుల క్రితం దదుడ్లు చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడులు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఐటి సోదాలపై తాప్సీ తాజాగా ట్విటర్ ద్వారా తన స్పందన తెలిపింది. ముఖ్యంగా మూడు విషయాలపై గత మూడు రోజులుగా తీవ్ర శోధన జరిగింది. 1) నాకు పారిస్‌లో బంగ్లా ఉందని ఆరోపించారు కదా.. ఆ ఇంటి తాళాలు కోసం శోధించాను. ఎందుకంటే వేసవి వస్తోంది కదా.. 2) అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఆశతో రూ.5 కోట్ల రిసీప్ట్ కోసం వెతికాను. ఎందుకంటే ఆ డబ్బును నేను గతంలోనే తిరస్కరించాను. 3)అలాగే గౌరవనీయ ఆర్థిక మంత్రిగారు చెప్పినట్టు 2013లో నాపై జరిగిన ఐటీ దాడుల జ్ఞాపకాన్ని కూడా శోధించానని తాప్సీ కేంద్ర ప్రభుత్వం తో పాటు ఐటి శాఖల పై వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు

ఇది ఇలా ఉండగా తాప్సీకి పారిస్‌లో ఓ ఖరీదైన బంగ్లా ఉందని, అలాగే లెక్కల్లోకి రాని 5 కోట్ల రూపాయల నల్లధనం ఆమె వద్ద ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క టాగ్ అజరుగుతున్న ఈ ఐటీ దాడులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందిస్తూ.. "ఇలాంటి దాడులు సర్వ సాధారణం. గతంలో 2013లోనూ వీళ్లపై ఐటీ దాడులు జరిగాయి కదా" అని ఆమె పేర్కొన్నారు. దీంతో తాప్సీ తాజాగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ట్విట్టర్ ద్వారా ఇచ్చింది అంతేకాకుండా తాప్సీపై ఇంతకుముందెపుడు ఐటీ దాడులు జరగలేదు.