ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలు
posted on Jan 17, 2020 5:15PM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను దూరం చేయడంలో ఉసిరికి సారి మరొకటి లేదు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి.

ఉసిరితో ఉపయోగాలు :
1. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
2. కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది.
3. ఉసిరిలో ఉండే విటమిన్ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
4. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
5. మధుమేహం రాకుండా నివారిస్తుంది.
6. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.