కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ కు సీరియస్ 

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు

తుపాకీ మిస్ ఫైర్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలు తనకు తెలపాలని ఆదేశించారు. . ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు.

Related Segment News