మనవడి మృతిని తట్టుకోలేక అమ్మమ్మ మృతి

మనవడు మరణించాడన్న వార్త వినగానే అమ్మమ్మ ఒక్కసారిగా కూప్ప కూలి పడిపోయి మృతి చెందిన ఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  స్నేహితులతో కలిసి సరదాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వా రావుపేటకు సరిహద్దులో కామయ్యపాలెం  సమీపంలోని  సంఘం వాగులో  ఈతకు వెళ్లిన పదవ తరగతి విద్యార్థి పదిహేనేళ్ల యశ్వంత్‌  ఆ వాగులో మునిగి మరణించాడు.  

మనవడి ఆకస్మిక మరణ వార్త విన్న యశ్వంత్‌ అమ్మమ్మ వెంకటమ్మ (60) తీవ్ర విషాదంలో మునిగిపోయి, రోదిస్తూ  ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.  ఒకే రోజు ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించడంతో అశ్వారావుపేటలో విషాద ఛాయలు ముసురుకు న్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu