గూగుల్‌లో జగన్ గుట్టు...అందుకే అసూయ : సోమిరెడ్డి

 

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు గూగూల్ రావడాన్ని వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు .విశాఖలో గూగుల్‌  ఏఐ హబ్‌ స్థాపనను అందరూ స్వాగతిస్తుంటే, వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. గూగుల్‌పై జగన్, ఆయన బృందానికి ఎందుకింత కడుపుమంట అని ప్రశ్నించారు. 

నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, “గూగుల్‌లో 6093 అని టైప్ చేస్తే జగన్ రెడ్డి జైలు చరిత్ర బయటపడుతుంది” అంటూ సెటైర్లు గుప్పించారు. గూగుల్ టేకవుట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుకున్న వారిని సీబీఐ గుర్తించిందని పేర్కొన్నారు.“జగన్ అండ్ కో చేసిన అవినీతి గుట్టు గూగుల్‌ రట్టు చేసింది కాబట్టే, ఇప్పుడు వాళ్లకు గూగుల్‌పై కోపం పెరిగింది. రాజా ఆఫ్ కరప్షన్ అని సెర్చ్‌ చేస్తే కూడా గూగుల్ జగన్ చరిత్రనే చూపిస్తుంది” అంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. తండ్రి పేరును వాడుకుని వేల కోట్ల అవినీతి చేసిన చరిత్ర బయటపడుతుందనే భయంతో వైసీపీ నేతలు మండిపోతున్నారని విమర్శించారు. 

రూ.1.33 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ ఏఐ హబ్‌ రావడం గొప్ప విషయం అని, ఇది రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు కృషితోనే కొత్త రాష్ట్రమైన ఏపీ ఈ ఘనతను సాధించిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తుంటే జగన్ మీడియాలో ఒక్క వార్త లేకపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. ఇంత కడుపుమంటతో రగిలిపోయే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకోవాల్సివచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని కలలు కనడం మరింత దుర్మార్గమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu