ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం... ఎందుకంటే?
posted on Oct 12, 2025 12:21PM

రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని మోదీ హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీకి ఆహ్వానం పంపించారు. హమాస్, ఇజ్రాయేల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఈ ఒప్పందంలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మోదీ హాజరుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆకలి చావులతో తీవ్రంగా అల్లాడిపోతున్న గాజాలో శాంతి సాధనకు అడుగులుపడిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని మొదటి దశను గమనార్హంగా ఇజ్రాయెల్, హమాస్ రెండూ అంగీకరించాయి. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు త్వరలో సంతకం చేయబోతున్నట్లు తెలిసింది. మొదటి దశ ప్రకారం గాజాలో దాడులను వెంటనే నిలిపివేయాల్సి ఉందని, హమాస్ తమ ధరల్లోని ఇజ్రాయెల్ బందీలను త్వరగా విడుదల చేయనూ, భదులుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వాటి నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలను వదిలివేయనుందని ప్రకటించారు. అదేవిధంగా, గాజా ప్రక్కన ఉన్న ఇజ్రాయెల్ సైన్యాన్ని వరుసగా వెనక్కి తీసుకెళ్లడం కూడా ఈ దశలో భాగమని వివరమవుతోంది.