కిట్స్ లేవు.. బెడ్స్ లేవు! తెలంగాణలో కరోనా కల్లోలం

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 3 వేల 8 వందలకు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే జిల్లాల నుంచి వస్తున్న లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. సర్కార్ చెబుతున్న కేసుల కంటే  రెండు, మూడు రెట్లు ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా వైరస్ విస్తరిస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి వైరస్ సోకుతోంది.

తెలంగాణలోని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. రోగుల తాకిడి పెరగడంతో గాంధీ ఆస్పత్రి ని శనివారం నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.  OPని నిలిపివేయనున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి కేవలం కోవిడ్ హాస్పిటల్ గా మార్చనున్నారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. గాంధీలో ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు. గురువారం  ఒక్కరోజే 150మంది అడ్మిట్ అయ్యారు. 10 నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. గాంధీలోని IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది. 

ఇక తెలంగాణలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. టెస్టుల కోసం జనాలు భారీగా వస్తుండటంతో కిట్లు లభించడం లేదు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో కరోనా టెస్ట్ కిట్స్ లేక పరీక్షలు నిలిపివేశారు. టెస్ట్ కిట్స్ అయిపోవడంతో టెస్ట్ లు చేసుకోకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు జనాలు. రెండు రోజుల కు సరిపడా 3000 వేళా కరోనా టెస్ట్ కిట్స్ తెప్పించారు వైద్య అధికారులు.