గూడూరు లో తప్పించుకుని చల్లపల్లిలో దొరికారు

posted on: May 24, 2026 8:14AM

గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను చల్లపల్లి పోలీసులు శనివారం రాత్రి జాతీయ రహదారిపై పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు, గూడూరుకు చెందిన నాగబాబు 12.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా గూడూరు పోలీసులు వెంబడించారు

అక్కడ తప్పించుకున్న వీరు  చల్లపల్లి వద్ద దొరికి పోయారు. వీరు వెడుతున్న బైక్   చల్లపల్లి వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి, వారి వద్ద నుంచి గంజాయి  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...