ఎల్ల‌లు లేని స్నేహం 

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. అంటూ పెద్ద రోడ్డుకి ఇరుప‌క్క‌ల నుంచి హీరోలు క‌లుసుకునేందుకు ఏకంగా పాట అందుకుంటారు.. స్నేహ‌బంధ‌మూ.. అంటూ న‌లుగుర‌యిదుగురు వ‌య‌సుమ‌ళ్లి స్నేహితులూ అంతే ఉత్సాహంగా పాడేసుకుంటారు.. ఇందులో ఎంతో నిజం ఉంది. స్నేహానికి ప్ర‌దేశం, దేశం, ఖండా ల‌తో ప‌రి మితులు విధించ‌లేం. అంతెందుకు రాజ‌కీయాల ప‌రంగా పాకిస్తాన్‌ను ఛ‌స్తే స్నేహితుడిగా అంగీ కరించ‌లేం. కానీ ఆట‌ల విషయానికి వ‌చ్చేస‌రికి క్రీడాకారులంతా స‌ర‌దాగా గ‌డిపేస్తుంటారు. ఒక‌రిని ఒక‌రు అభినందించుకోవ‌డం, జోక్స్ వేసుకోవ‌డ‌మూ చూస్తుంటాం. 

ఇది అస‌లు సిస‌లు ప్రేమ‌. కాలం మారి నా అలాంటి స్నేహాలు ఉంటాయి. ఇపుడు తాజాగా హార్వ‌ర్డ్ వ‌ర్సి టీలో ఇద్ద‌రు త‌మ స్నేహం గురించి తెలియ జేశారు. ఒక‌రు భార‌త్‌కి చెందిన అమ్మాయి, మ‌రొక‌రు పాకి స్తాన్! వీరిద్ద‌రూ చాలాకాలం త‌ర్వాత క‌లిసేరు. కానీ అంతే స్నేహ‌పూర్వ‌కంగా, మ‌రెంతో అభిమానంతో మాట్లాడుకున్నారు. తాను ఇన్నాళ్ల‌కు పాక్ స్నేహితురాలిని క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని స్నేహా ప్ర‌క‌టించింది. 

చిత్ర‌మేమంటే ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని రాజ‌కీయ నాయ‌కులు రాజకీయాల‌ను దూరం పెట్ట‌డానికి ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేదు. దాడులు, మార‌ణ‌హోమాలు సృష్టించ‌డానికే కంక‌ణం క‌ట్టుకోవ‌డం పాక్ వంతు అయింది. 

స్నేహా బిస్వాస్ హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్లో చ‌దువుతోంది. ఇటీవ‌లే ఆమె కాలేజీ ఆవ‌ర‌ణ‌లో ఒక‌మ్మాయిని చూసి క్ష‌ణం నివ్వెర‌పోయింది. ఎక్క‌డో క‌లిసిన మొహంలానే ఉందే అనుకుంది. అంతే ఒక్క‌సారి గ‌తం సినిమా రీలులా తిరిగింది. రీలు ఆగ‌గానే ఆమె త‌న పాకిస్తానీ స్నేహితురాల‌న్న‌ది గుర్తించింది. ఇస్లామా బాద్ అమ్మాయితో ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ అయ్యేలోగా మ‌రింత స‌న్నిహితురాల‌య్యింది స్నేహా. ఆమె ధైర్యంగా చెప్పే అనేక విష‌యాల‌ప‌ట్ల స్నేహా ఆక‌ర్షితురాల‌యింది. మ‌నం అనుకుంటున్న వైరానికి అస‌లు అక్క‌డి ప్ర‌జ‌ల్లో భార‌త్‌ప‌ట్ల ఉన్న అభిమానానికి పొంత‌నే లేద‌ని స్నేహా అభిప్రాయ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.