శ్మ‌శానంలో రే-ప్‌.. బాలిక మ‌-ర్డ‌ర్‌.. న‌లుగురి అరెస్ట్‌..

కామా*థులు బ‌రితెగించారు. 9 ఏళ్ల బాలిక‌పై దారుణానికి తెగబ‌డ్డారు. అది శ్మ‌శాన‌మ‌నే విష‌యం కూడా మ‌రిచారు. ప్లేస్ ఏదైనా పైశాచిక‌త్వంను వీడ‌లేదు. కాటికాప‌రితో పాటు మ‌రికొంద‌రు ఆ చిన్నారిని చెరిచారు. ఆ త‌ర్వాత అతిదారుణంగా చంపేశారు. ఖాకీల నుంచి త‌ప్పించుకునేందుకు హ‌డావుడిగా ఆ శ్మ‌శానంలోనే ద‌హ‌నం చేసేశారు. దేశ రాజ‌ధానిలో జ‌రిగిన ఈ ఘోరం క‌ల‌క‌లం రేపుతోంది. తండ్రి ఫిర్యాదుతో న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.     

ఢిల్లీలోని పాత నంగల్‌ గ్రామంలో జ‌రిగిందీ అమానుషం. బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటోంది. శ్మ‌శానానికి వ‌చ్చే వారి సౌక‌ర్యార్థం అక్క‌డో వాట‌ర్‌కూల‌ర్ ఉంది. అక్క‌డి నీటికోసం శ్మ‌శానానికి వెళ్లింది ఆ చిన్నారి. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి ద‌గ్గ‌ర‌కు వచ్చి క‌రెంట్ షాక్‌తో బాలిక మరణించినట్లు చెప్పాడు. పాపం.. నిజ‌మేన‌నుకొంది ఆ త‌ల్లి. పోలీసులకు విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని ఆమెను న‌మ్మించి.. బలవంతంగా అప్ప‌టిక‌ప్పుడు మృతదేహాన్ని దహనం చేయించాడు కాటికాప‌రి. ఇక త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్యా రాద‌నుకున్నారు ఆ దుర్మార్గులు.

ఆ త‌ర్వాత ఇంటికొచ్చిన తండ్రికి విష‌యం తెలిసి షాక్‌కు గురయ్యాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫోన్ చేశాడు. పోలీసులు వ‌చ్చే స‌రికి శ్మ‌శానంలో కాలిపోయిన బాలిక కాళ్లు మాత్రమే మిగిలాయి. బాలికపై అత్యా-చారం జరిగిందా లేదా అనేది తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. కాటికాప‌రితో స‌హా మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.