కిడ్నాప్‌ కేసులో లొంగిపోవాలి.. న్యాయ‌శాఖ మంత్రి అయ్యాడు!

కాస్తంత చ‌దువుంటే ఎవ‌ర‌యినా రాజ‌కీయాల్లోకి రావ‌చ్చు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు. ప్ర‌జాస్వామ్యంలో ఇదో అవ‌కాశం. నిరుద్యోగి విసిగెత్తి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి నిల‌దొక్కుకున్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన కాలం కాదిది. సామాజిక ప‌రిస్థితులు, రాజ‌కీయ నాయ‌కులు, పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల విసిగెత్తి త‌న ప్రాంతానికి తానే ఏదో ఒక మేలు చేయాల‌న్న గ‌ట్టి నిర్ణ‌యం తీసేసుకుని రాజ‌కీయాల్లోకి దిగి ఏకంగా సీఎం కావ‌డం సినిమాల్లో చూస్తాం. 

అంత‌కాకున్నా క‌నీసం ఎమ్మెల్యే కావ‌డానికి వాస్త‌వ రాజ‌కీయాల్లో అవ‌కాశం ఉంది. బీహార్‌లో మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కార్తికేయ పై ఇంత‌కు ముందే కేసులు ఉన్నాయ‌ని తెలిసింది. అలాంటి కోర్టు ప‌క్షిని మంత్రిమండ‌లిలోకి ఎలా తీసుకుంటార‌ని నీతిస్‌పై దుమారం మొద ల‌యింది. 

గ‌తంలో ఎంత అద్భుతం కాకున్నా, రాజ‌కీయాలు వంట‌ప‌డితే నేత కావ‌చ్చున‌న్న‌ది బీహార్ రాజ‌కీయాల్లో నే గ‌మ‌నించ‌గ‌లం. ఇపుడు తాజాగా, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ క్యాబినెట్‌లోకి 31 మందిని తీసు కున్నారు. ఇందులో 16 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండ‌గా, ఆర్జేడీ ఎమ్మెల్సీ కార్తికేయ సింగ్ న్యాయశాఖ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం వివాదానికి దారి తీసింది. 

కిడ్నాపింగ్ కేసులో కార్తికేయ  సింగ్ ఈనెల 16న దనపూర్ కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, ఆయన నేరు గా పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, కళంకిత మంత్రిని క్యాబి నెట్ లోకి తీసుకోవడం నితీష్‌ను ఇరకాటంలోకి నెట్టింది. '

 కానీ  కార్తీకేయ కేసుల గురించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని, అస‌లు అందుకు సంబంధించిన ఎలాంటి స‌మాచారం త‌న వ‌ద్ద లేద‌ని, ఎవ‌రూ తెలియ‌జేయ‌లేద‌ని బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా చెప్పారు.