రూ. 10  అడిగి.. రూ. 2 లక్షలు స్వాహా.. 

టీకా పేరుతో భలే మోసం. ఒక వైపు కరోనా జనాలను చంపుతుంటే మరో వైపు సైబర్ నేరగాళ్లు చెపుతున్నారు. వారికి సెంటిమెంట్ తో పనిలేదు. జనాలు ఆపదలో ఉన్నారా అవసరం లేదు. వారికి డబ్బులు కావలి. అందుకోసం జనాలతో ఆడుకుంటారు. అదే వాళ్ళ పని, అదే వాళ్ళ పెట్టుబడి. అందుకోసం వాళ్ళు ఈజీ మనీ కి అలవాటు పడ్డారు.. అదే సైబర్ క్రైమ్.. సైబర్ క్రైమ్ పేరు కొంచం రిచ్ గా ఉన్న వాళ్ళు చేసి పని కూడా వాళ్లకు రిచ్ గానే ఉంటుంది.   

సైబర్‌క్రైం నేరగాళ్ల నయా మోసాలు రోజురోజూకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఉద్యోగం పేరుతో కుత్బుల్లాపూర్‌కు చెందిన మహిళను సైబర్‌నేరగాళ్లు మోసగించారు. ఉద్యోగం పేరట సుమారు రూ.2.52 లక్షలను కాజేశారు. ఉద్యోగం కోసం నౌకరి.కామ్‌లో మహిళ తన వివరాలు నమోదు చేసింది. దీంతో సైబర్‌నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.10 చెల్లించాలని అడిగారు. నిజమే అని నమ్మి సదరు మహిళ సైబర్‌ నేరగాళ్లు పంపిన లింక్‌ క్లిక్‌ చేయడంతో ఖాతా నుంచి నగదు మాయం అయింది. ఆమె ఖాతా నుంచి పలు విడతలుగా రూ.2.52 లక్షలను సైబర్‌ నేరస్థులు స్వాహా చేశారు. దీంతో బాధితురాలు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కొవిడ్‌ టీకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు బంజారాహిల్స్‌కు చెందిన వస్త్ర వ్యాపారిని మోసం చేశారు. వస్త్ర దుకాణంలో సిబ్బందికి కరోనా టీకాలు వేస్తామని దుండగులు రూ.1.10 లక్షలను  అడిగారు. దీంతో సదరు వ్యాపారి దుండగుల ఖాతాకు నగదును పంపాడు. అనంతరం దుండగులు స్పందించకపోవడంతో బాధితులు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.