కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం

హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు  పై ఓ కారు దగ్ధమైన ఘటనలో ఆ కారు డ్రైవర్ సజీవదహనమయ్యాడు.  వివరాలిలా ఉన్నాయి.  శామీర్‌పేట నుంచి ఘట్‌కేసర్ వైపు ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి.

ఆ సమయంలో కారు వేగంగా వెళుతుండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించి ఏమైందో గ్రహించేలోగానే డ్రైవర్ ఆ మంటల్లో సజీవదహనమయ్యాడు.   సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu