సినిమా థియేటర్ లో అగ్నిప్రమాదం
posted on Jul 30, 2025 3:18PM

థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన బుధవారం ( జులై 30)న కావలిలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని స్రవంతి థియోటర్ లో సినిమా నడుస్తుండగానే ప్రొజెక్టర్ రూంలో ఒక్క సారిగా మంటలుచెలరేగి థియోటర్ మొత్తం వ్యాపించాయి. దీంతో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన థియోటర్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో థయేటర్ ప్రొజక్టర్ రూంలో ఉన్న సామగ్రి మొత్దం అగ్నికి ఆహుది అయ్యింది. అలాగే థియేటర్ లోకి కూడా మంటలు వ్యాపించడంతో ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. ఈ థియేటర్ లో గురువారం (జులై 31) విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగాన అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సందర్శించారు. సకాలంలో మంటలను ఆర్పి భారీ నష్టాన్ని నివారించిన ఫైర్ సిబ్బందిని అభినం దించారు.