గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

 

 

 

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లో  సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో  శనివారం చోటుచేసుకుంది.  అమృత్‌సర్ నుంచి సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు   అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులు వెంటనే కిందకి దిగిపోయారు.

ఈ సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.  అయితే మూడు బోగీలు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదకారణాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు.  ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu