ఇన్ఫెక్షన్లు శరీరానికి హానికరం...

శరీరానికి అపకారాన్ని కలగ జేసే సూక్ష్మ క్రిములు మనశారీరంలోకి ప్రవే సించి నప్పుడు.
వచ్చే క్రిములను పతోజేన్స్ అంటారు.వీటి ప్రవేశం తో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.
పాతోజెన్స్ లో ఈ క్రింది రకాలు ఉంటాయి.
బాక్టీరియా
వైరస్ లు 
ప్రోటోజోవా 
రికెట్సి యే 
 ఫంగి 
పురుగులు.
ఇలాంటి రకరకాల క్రిములు కూడా ఒక మనిషి నుంచి మరొక మనిషికి అనేక మార్గాల ద్వారా సోకు తూ ఉంటాయి.

1) ఒక వ్యక్తి దగ్గినప్పుడు.గాలి లోకి వ్యాపించే తుంపర అవతలి వ్యక్తి పీల్చడం ద్వారా వేరొకరికి 
సోకుతుంది.

2)కొన్ని రకాల క్రిములు ముద్దు ద్వారా,సంభోగం ద్వారా,ఒకరినుంచి మరొకరికి సోకుతుంది.

3)దోమల ద్వారా ప్రోటోజోవా రకానికి చెందిన ప్లాస్మోడియం అనబడే మలేరియా క్రిములు ఒకరి  నుండి మరొకరికి వ్యాప్తి చెందు తాయి.

4)పక్షుల ద్వారా, చిలకల ద్వారా ప్సిట్టకాసిస్ అణా బడే బ్యాక్టీరియా సోకుతుంది.

5)కలుషితమైన ఆహారం,నీరు,మట్టిలో కొన్ని విష క్రిములు.ఇవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేసిస్తాయి.

6)కొన్ని విష క్రిములు తల్లి ద్వారా, గర్భదారణ సమయంలో ప్రసవ సమయంలో ను బిడ్డకు 
సోకు తాయి.

క్రిములు ఎలా ఎప్పుడు పోడుగుతాయి....

1)మనకు అపకారాన్ని కలగ జేసే విష క్రిములు ఒక సారి శరీరంలోకి ప్రవేశించాక అవి తమ ఉత్పత్తిని 
వృద్ధి చేసుకుంటూ పోతాయి.అవి మన శరీరం పై ప్రభావాన్ని చూపుతూ తమ లక్షణాలను ప్రదేసించడానికి  కొంత సమయం పడు తుంది. 

2)క్రిములు శరీరం లోకి ప్రవేశించి లక్షణాల్ని ప్రదర్సుంచే దాకా ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పొడగాబడే కాలం అని అంటారు.

3)ఇంక్యు బేషన్ కాలం అనేది కలరా లాంటి వ్యాధికి కొన్ని గంటల సమయమే పడితే  కాలేయం మీద ప్రభావాన్ని చూపడానికి 5 నెలల సమయం పడుతుంది.ఈ వ్యాధిని హేపటైటిస్ వ్యాధి అని అంటారు.

4)ఒక వ్యక్తికి అంటూ వ్యాధి వచ్చినప్పుడు అతని శరీరం ఆ ఇన్ఫెక్షన్ మీద పోరాడడానికి కొన్ని యాంటీ బాడీస్ కావాలి వాటి అభివృధి చేసుకుంటుంది.

5)ఆ వ్యాధి తగ్గిన తరువాత కూడా యాంటి బాడీస్ అతని శరీరంలో నిలవ ఉండి మళ్ళీ అలంటి క్రిములు సోకి నప్పుడు దానిని నివారించ గలిగే స్థితిలో ఉండి ఆ క్రిమికి సంబందించినంత మేర అతడిలో సహజసిద్ధ నిరోధక శక్తిని ఏర్పరుస్తాయి.

6)శరీరంలో వివిధ రకాల రోగాలతో పోరాడే యాంటీ బాడీస్ తాయారు అయ్యేటట్లు టీకాలు అంటే వ్యాక్సిన్ల ద్వారా శరీరానికి కృత్రిమంగా ప్రేరే పిస్తారు డాక్టర్లు.

అసలు వ్యాక్సిన్ లోని సూత్రం ఏమిటి?...

1)ఫలానా వ్యాధి కి సంబందించిన పదార్ధాన్ని తగిన మోతాదు లో వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశ పెట్టినప్పుడు. వ్యాధి ఏర్పడ కుండానే  ఆ వ్యాధితో పోరాడ గలిగే యంటి బాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి.ఇక అప్పటినుంచి ఆ వ్యక్తిని ఆ వ్యాదిక్రిములు ఏమీ చేయలేవు.

2)అంటే అతడి శరీరం అప్పటి నుంచి ఆ వ్యాధి క్రిములను నివారించాగలిగే స్థితికి చేరుకుంతుంది అంటే మరో మాట చెప్పాలంటే అతడికి వ్యాధి రాదని ఆర్ధం.

3)అంటే అన్నిరకాల ఇన్ఫెక్షన్ లకు వ్యాక్సిన్ ఇంకారాలేదు.కాని ఇప్పటికీ లభ్యమౌతున్న వ్యాక్సిన్స్ తో మనం కొన్ని భయంకర మైన వ్యాధులను నివారించుకో గలిగాం అయితే కోవిడ్ లాంటి మహమ్మారికి ఇంకా పూర్తిగా పరిశోదన చేస్తేగాని మరిన్ని వ్యాక్సిన్లు మందులు వస్తే తప్ప కోరోనాపై పూర్తిగా అదుపు చేయలేము. అందుకే ప్రపంచం యావత్తు మహమ్మారి పై యుద్ధం చేసేందుకు ఎవరికీ ఉన్న పరిజ్ఞానం మేరకు వారి వారి స్థాయిని  బట్టి  ఇంకా పరిశోదనలు చేస్తూనే ఉన్నారు. మానవుడు ఆశాజీవి వివిధ రూపాలలో మారుతున్న కోరోనా  వైరస్ ను కనుక్కో వాలంటే వైద్యులు ఎన్ని ఏళ్ళు తపస్సు చేయాలో 
కాలమే సమాధానం చెప్పాలి. ప్రాకృతికంగా సహజ సిద్ధమైన ఔషదాలు,ఆధునిక చికిత్సలు అవసరమైన మేర ఉన్నప్పటికీ పూర్తిగా వైరస్ పోయే వరకు విస్రమించాల్సిందే. గతంలో వచ్చిన వైరస్ లను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఎలా ఉపయోగ పడిందో అలాగే  వైరస్ పై పోరాడాలంటే వ్యాక్సిన్ తోనే సాధ్యమని నిరూపించారు. వ్యాక్సిన్ వేసుకోండివైరస్ ను తప్పించు కొండి.వ్యాధి పై పోరాడండి.