ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే పొట్ట కొవ్వు ఐస్ లా కరుగుతుంది..!

 

బరువు తగ్గడానికి ఏమి తినాలి, వేగంగా బరువు తగ్గడానికి ఏమి తినాలి, పొట్ట కొవ్వు తగ్గడానికి ఉదయాన్నే ఏమి తినాలి, వేగంగా బరువు తగ్గడానికి ఏ ఆహారం సహాయపడుతుంది? ఇప్పట్లో చాలా మంది నెట్టింట్లో  సెర్చ్ చేస్తున్న విషయం  ఇది.  దీనికి తగ్గట్టే ఈ కాలంలో చాలా మంది బానడంత పొట్టతోనూ,  అధికబరువు తోనూ ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం  అందాన్ని పాడు చేయడమే కాకుండా క్యాన్సర్,  మధుమేహం నుండి గుండెపోటు వరకు అనేక   ప్రాణాంతక వ్యాధుల వైపు ప్రజలను నెట్టివేస్తుంది. ముఖ్యంగా చాలా మంది పొట్ట, నడుము చుట్టూ కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు, ఆరోగ్యకరమైన ఆహారం మైంటెన్ చేసినా  జిమ్‌కి వెళ్లినా ఈ పొట్ట కొవ్వు మాత్రం తగ్గదు.  పొట్ట తగ్గాలంటే తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తినాలి. ఇవి పొట్టను తగ్గిస్తాయి.  ఈ ఆహారాల లిస్ట్ తెలుసుకుంటే..

దోసకాయ..

దోసకాయలో కేలరీలు తక్కువ,  ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 104 గ్రాముల దోసకాయలో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులోని ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.  ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దోసకాయలు ఎక్కువగా నీరుతో నిండి ఉంటాయి., ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో  చక్కెర ఉండదు కాబట్టి ఇ బరువు పెరుగుతామనే ప్రశ్నే ఉండదు.

పార్స్లీ..

పార్స్లీ ఆకులు ఫైబర్,  పోషకాలకు మంచి మూలం.  కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది గొప్ప ఆహారంగా సహాయపడుతుంది. పార్స్లీలో ఉండే పీచు ఎక్కువ సేపు  కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. పార్స్లీలో 95% నీరు ఉంటుంది. కాబట్టి ఇది హైడ్రేటెడ్‌గా ఉండటానికి  సహాయపడుతుంది.

పుచ్చకాయ..

పుచ్చకాయ బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది.   విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు ఫైబర్, ప్రోటీన్,  ఆరోగ్యకరమైన కొవ్వుల  మంచి మూలం. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. కాబట్టి ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయలో విటమిన్ ఎ,  సి అధికంగా ఉంటాయి, ఇది  జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజల్లో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు,  మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి  కడుపు నిండుగా ఉండేందుకు,  ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.

గుమ్మడికాయ..

గుమ్మడికాయ తక్కువ కేలరీల కూరగాయ. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్,  నీరు అధికంగా ఉంటాయి. ఇది  కడుపు నిండుగా అనిపించేలా,  తక్కువ తినడానికి సహాయపడుతుంది. పాస్తా లేదా బియ్యం వంటి అధిక కేలరీల పదార్థాలకు ప్రత్యామ్నాయంగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది 100 గ్రాములకు దాదాపు 17 కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది.  ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

బ్రోకలీ..

బ్రోకలీ బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్,  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో,   జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్రోకలీలో విటమిన్ ఎ, సి,  కె అలాగే ఫోలేట్,  పొటాషియం ఉంటాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఆకలిని అణిచివేసేందుకు,  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పైన పేర్కొన్న ఆహారాలే  కాకుండా టొమాటోలు, పుట్టగొడుగులు, పాలకూర, క్యాబేజీ, బ్లాక్ కాఫీ వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది అధిక ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే అధిక కెఫీన్ మంచిది కాదు.

                                   *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu