నకిలీ మద్యం కేసులో సూత్రధారులకు చుక్కలు చూపిస్తాం : మంత్రి కొల్లు

 

నకిలీ మద్యం కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం నాణ్యత లేని, హానికరం కాని పదార్థాలు ఉపయోగించినట్లు తేలిందని మంత్రి పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సూత్రధారులు, పాత్రధారులకు చుక్కలు చూపిస్తామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నానికి మతిచేడి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. రూ.99 బ్రాండ్లు నిలిపివేశామనడం చెప్పడం ఆయన ఆజ్జానానికి నిదర్మనమన్నారు. జనార్థన్ రావు తన ఇంటికి వచ్చినట్లు జోగి రమేశ్ అంగీకరించారని మంత్రి కొల్లు అన్నారు. వాస్తవాలు బయటకు వస్తుంటే జగన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని పేర్కొన్నారు. 

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాను స్కాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు. ఇండెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా?అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు కల్తీ మద్యం అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వైసీపీని తరిమికొట్టారని తెలిపారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. సిట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం 2014-19లోనే తీసుకొచ్చామని గుర్తు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu