బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు వృద్ధి చేయవచ్చా??


సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు. అన్ని ఇంద్రియాలాలో ముఖ్యమైనది ప్రధాన మైనది కన్నె.  పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయిన వాళ్ళు. ఒక్కో అనారోగ్య సమస్యతో కళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు   కన్ను ఒక కెమెరా లాంటిది కెమెరా లెన్స్ పై పడే వెలుతురు ఆధారంగా కమెరా లెన్స్ లో రక రకాల  రంగుల్లో సృష్టిని చూడగలం ఆశ్వాదించగలం. అందరికి కళ్ళు  ఉన్న నిజం కనపడుతున్న గుడ్డివాళ్ళలా నటిస్తున్నారు. నిజానికి ఎదో రకంగా కంటి చూపు కోల్పోయిన వారికి జీవితం చీకటి గా ఉంటుంది. ఇక డయాబెటిస్ వల్ల, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, హై బిపి వల్ల, లేదా రోడ్డు ప్రమాదాల బారిన  పడ్డవారికి కంటి చూపు కోల్పోతే ఆజీవితం ఎంత దుర్భరమో చెప్పడం కష్టం.

స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు తగ్గి పోతుందా?.....

 స్ట్రోక్ వల్ల కంటి చూపు తగ్గితే   పునరుద్ధరించడం అసాధ్యమని అనుకున్నారు. కొన్నేళ్లుగా వస్తున్న  దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యకు కంటి చూపు ను తిరిగి రప్పించవచ్చు అంటూ ఒక ఆశాకిరణం గా కనిపిస్తుంది.అసాధ్యాన్ని సు సాధ్యం చేయడమే సైన్స్ అని నిరూపించారు

కొందరు వైద్య విద్యార్ధులు ఇక వివరాల లోకి వెళితే ....

ఎం ఆర్ ఐ ఇమేజింగ్ ద్వారా మ్యాప్ విజువల్ ద్వారా బ్రెయిన్ యాక్టి విటీ ద్వారా స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు పోయే ప్రమాదం నుండి కంటి చూపు తిరిగి తెప్పించవచ్చు. ఈ అంశం పై చేసిన పరిశోదన ఎం ఆర్ ఐ స్కాన్ ను వినియోగించి ఇమేజింగ్ మ్యాప్ విజ్జ్యు వల్ ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ ని గుర్తించ వచ్చు. తద్వారా స్ట్రోక్ వచ్చి బతికిన వారిలో కంటి చూపు పోయే ప్రమాదం ఉన్నందున వారికి తిరిగి కంటి చూపు తెప్పించ వచ్చనే ఆశని కల్పించారు. నాటింగ్ హామ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

నిర్ధారణ ...

స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు ఎలాఉందో నిర్ధారించడానికి క్లినికల్ సైట్ టెస్ట్ ద్వారా బ్రెయిన్ ఇమేజింగ్ మెదడులో ఉన్న వివిద ప్రాంతాలను స్ట్రోక్ వల్ల ప్రభావితమైన కణాలను. కణజాలాలను వాటి పని తీరును పరిశీలిస్తారు. వారికి పూర్తిగా సరైన పునరావాసం కల్పించడం ద్వారా కంటి చూపు వృద్ధి చేయవచ్చు అంటూ వారు చేసిన పరిశోదన వివరాలను చారిటి ఫైట్ ఫర్ సైట్ లో ప్రచురించారు. ఇది వైద్యరంగం న్యూరో సైన్సెస్ లో ముందడుగుగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. ప్రతి ఏటా దాదాపు  1,5౦, ౦౦౦  ప్రజలు యు కే లో స్ట్రోక్ తో బాధ పడుతున్నారు. అంటే దాదాపు 3౦% ఒక రక మైన కంటి చూపు సమస్యను ఎదుర్కుంటున్నారు. దీనివల్ల సహజంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సెలబ్రల్ స్ట్రోక్ వల్ల వచ్చే కంటి చూపు సమస్యను హేమియాపియా  వ్యక్తికి ఒక వైపు కంటి చూపు కోల్పోవడానికి కారణం మెదడులోని కంటి నరాలు దెబ్బతినడం రెటీనా సమస్యగా చెప్పవచ్చు కంటి చూపు పునరుద్ధరించడానికి  పునరావాసం కల్పించి విజువల్ ఫీల్డ్ విజువల్ స్టీము లేషన్ ద్వారా కంటి చూపు తిరిగి వృద్ధి చేయవచ్చు. 

స్టిమ్యులేషన్ ద్వారా కంటి చూపు వృద్ధి.....

ఒకనూతన పరిశోదన పరిశీలన ప్రాధమికంగా మల్టిపుల్ బ్రెయిన్ ఇమేజింగ్ సమాచారం ద్వారా స్ట్రోక్ వచ్చి బతికిన వారిలో ప్రాధమికంగా ఎక్కడ సమస్య  తీవ్రమైంది బ్రెయిన్ ఇమేజింగ్  డా టా నూతన పద్దతిలో కనుగొన్నారు. దీనిద్వారా తెరఫీ పని తీరును మెరుగు పరచ వచ్చు.అంటున్నారు ఈ అంశం పై పరిశోదన చేసిన వైద్య విద్యార్ధులు. ఈ పరిశోదనను పి హెచ్ డి విద్యార్ధి అంటోనీ బెన్ నాటింగ్ హమ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైకాలజీ డాక్టర్ బెన్ వెబ్ ప్రోఫెసర్.పాల్ ఎం సి గ్రౌ అంటోనీ వివరించారు. సహజంగా అందరిలో ఉండే ఆపోహ అనుమానం ఉంది. స్ట్రోక్ తరువాత కంటి చూపు కోల్పోవడం కంటి ద్వారా మాత్రమే కదా లేక ఒక కన్ను  మాత్రమే కదా రెండు కళ్ళూ కాదుకదా? అని అనుకుంటారు. అయితే కళ్ళు మాత్రమే చూస్తాయి. బ్రెయిన్ కాదు కదా అని అనుకోవచ్చు. అయితే మన మెదడు మనకు కొంత సమాచారాన్ని మనకు అందిస్తుంది.

ఈ రకమైన కంటి చూపు సమస్య ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు , చదివే టప్పుడు, నేవిగేటింగ్ చేసేటప్పుడు, బాగా ఒక ప్రాంతం లో సమోఇహాం ఉన్నప్పుడు. వయస్సు మళ్ళిన వాళ్ళలో ప్రమాదం ఉంది. స్ట్రోక్ ద్వారా మెదడు లోని  రక్త నాళాల పై పడే ప్రభావం  ఎం ఆర్ ఐ ద్వారా రక రకాల విజువల్ స్టిమ్యు లేషణ్ విజువల్ కార్టెక్స్ రెసిడ్యుయల్ యాక్టివిటి ని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తారు. అవకాశం ఉన్నమేర  కంటి చూపు పునరుద్దరణ పునరావాసం కల్పించడం వల్ల స్ట్రోక్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక ఆశనమ్మకం   కల్పించగలిగారు. ఇటీవలి పరిశోదనలు చేసిన డాక్టర్ స్చ్లు పెక్ మాట్లాడుతూ  రక రకాల బ్రెయిన్ స్కాన్ ద్వారా రెసి డ్యుయల్ విజన్ ను గుర్తిస్తారు. ఎక్కడై తే మెదడు కళ్ళు ఇప్పటికే రూపాన్ని ఊహిస్తాయి.ఇప్పటికీ దీనిగురించి అవగాహన లేకుంటే ఎం ఆర్ఐ ద్వారా  వాటిని సూక్ష్మం గా గుర్తిస్తామని డాక్తర్ స్చ్లుప్పెక్ వివరించారు

కంటి చూపు పునరుద్ధరణ పునరా వాసం.....

ఈ పరిశీలన అనంతరం తిరిగి మరలా పునరావాసం కల్పించి కంటి చూపు పునరుద్ధరణ చేయవచ్చు.వైద్యులు దీనిపై స్ట్రోక్ వచ్చిన వారు బతికి బట్టకట్టిన వారిని అందులోనుండి బయట పడ్డవారిని.బయట పాడేందుకు వారికి శిక్షణ నిచ్చి నివారించే ప్రయత్నం చేస్తారు. ఈ పరిశోదన కొందరిలో రక రకాల సమస్యలతో కోల్పోయిన వారిపై వివుదరకాల రోగులలో బ్రెయిన్ డ్యామేజ్ అయిన వారిలో ప్రతి ఒక్కరికి ఒక్కోరక మైన పునరావాసం ప్రణాళిక పద్దతులు అవలంబిస్తారు. ఫైట్ ఫర్ సైట్ కంటి చూపు కోసం పోరాడండి.

యు కే చారిటీ ద్వారా కంటి చూపు కోల్పోయిన వారిపై పరిశోదన చేసేందుకు ఈ ప్రోజక్ట్ కు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఫైట్ ఫర్ సైట్ సంస్థ అంతర్గత ప్రాధాన నిర్వహణ అధికారి ఇక్రాం రహమాన్ చాలా కీలక మైన పరిశోదన చాలా ఆశలు చిగురింప చేసింది.మెదడులో ఏర్పడ్డ గాయాల వల్ల కంటి చూపు కోల్పోయిన వారికి  పునరావాసం కల్పించడం ద్వారా వారిని స్వతంత్రంగా జీవించే విధంగా నాణ్యతతో కూడిన జీవనం వారికి అందించాలని కీలక మైన ఉపయుక్త మైన పరిశోదనగా పేర్కొన్నారు. ఇక స్ట్రోక్ వచ్చిన వారికి కంటి చూపు వృద్ది చేసుకోవచ్చు. ఒక ఆశాకిరణం