ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. పలువురు నక్సల్స్ మృతి?
posted on Nov 11, 2025 12:42PM
.webp)
ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్యా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం (నవంబర్ 11) ఉదయం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు ధృవీక రించారు.
పలువురు నక్సల్స్ మరణించారనీ, అయితే ఎంత మంది మరణించారన్న విషయంలో స్పష్టత లేదనీ అన్నారు. కాగా ఆదివారం (నవంబర్ 9)న గురియాబంద్ జిల్లాలో కూడా మావోలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సలైట్లే ఇప్పుడు బీజాపూర్ వద్ద ఎన్ కౌంటర్ లో ఉన్నారని అంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.