ఎగ్జిట్‌పోల్స్‌కి అంత సీన్ లేదు.. సీఈసీ!
posted on Oct 15, 2024 6:05PM

ఎగ్జిట్ పోల్స్ విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా (సీఈసీ) రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని, ఎగ్జిట్‌పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని, ఎగ్జిట్‌పోల్స్ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే అవకాశం లేదని అన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకటనలో స్వీయ నియంత్రణ అవసరమని సీఈసీ స్పష్టం చేశారు. ఎగ్జిట్‌పోల్స్ ఆధారంగా తమపై నిందలు అర్థ రహితమని, ఎన్నికలలో ఓడిపోయినవారు ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఈసీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం. ఎన్నికలకు 6 నెలల ముందే ఈవీఎంలను పరిశీలిస్తాం. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలు ఉపయోగిస్తాం. పోలింగ్‌కు ఐదు రోజుల ముందు బ్యాటరీలు అమరుస్తాం. మూడెంచల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయి. తమకు అనుకూలంగా లేని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై విమర్శలు చేస్తూ వుంటారు’’ అని సీఈసీ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు.