ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
posted on Oct 13, 2025 4:25PM
.webp)
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. జోయెల్ మోకీర్, అఘీయన్, పీటర్ హూవీట్‌కు నోబెల్ బహుమతి దక్కింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధి సిద్దాంతానికి గాను ఈ పురస్కారం అందించనున్నట్టు నోబెల్ ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ఫిలిప్ అఘియన్, పీటర్ హౌయిట్‌లకు ‘ఇన్నోవేషన్-డ్రైవెన్ ఎకనామిక్ గ్రోత్’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు గాను ఈ గౌరవం లభించింది.
జోయెల్ మోకిర్ అమెరికన్-ఇజ్రాయెల్ ఆర్థిక చరిత్రకారుడు. ప్రస్తుతం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావాన్ని ఆయన విస్తృతంగా పరిశీలించారు. ఫిలిప్ అఘియన్ ఫ్రెంచ్-బ్రిటిష్ ఆర్థికవేత్త. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన, పోటీ, ఆవిష్కరణ, వృద్ధి మధ్య సంబంధాన్ని ప్రత్యేక మోడల్స్ ద్వారా వివరించారు. మరో శాస్త్రవేత్త పీటర్ హౌయిట్ కెనడాకు చెందినవారు.
బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన, ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలో ఎలా పనిచేస్తాయో గణిత మోడల్స్ ద్వారా ప్రపంచానికి చూపించారు. మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 12 మిలియన్ అమెరికన్ డాలర్లు) విలువైన ఈ బహుమతి ముగ్గురికి సమానంగా పంచనున్నారు. కాగా ఇటీవలే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో శాస్త్రవేత్తలకు , అలాగే శాంతి పురస్కారాలని నోబెల్ కమీటి ప్రకటించిన సంగతి తెలిసిందే.