Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్యూబా, ఇరాన్ లను కుదిపేసిన భూకంపాలు
posted on: Jun 9, 2026 9:16AM

క్యూబా, ఇరాన్ లలో భూమి కంపించింది. రెండు వేర్వేరు ప్రాంతాలలో గంటల వ్యవధిలోనే శక్తిమంతమైన భూకంపాలు సంభవించడం తీవ్ర ఆందోళన కలిగించింది. సోమవారం (జూన్ 8) మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది.
ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది. సోమవారం (జూన్ 8) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
క్యూబాలో భూకంపం సంభవించిన గంటల వ్యవధిలోనే.. అంటే మంగళవారం (జూన్ 9) తెల్లవారు జామున ఇరాన్ హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లోని సర్గజ్ సమీపంలో 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భూ అంతర్భాగంలో 22 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.






