హైదరాబాద్ లో భూ ప్రకంపనలు.. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భూ ప్రకంపనలు వచ్చాయి.  సోమవారం తెల్లవారుజామున నగరంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. భూకంప కేంద్రం యొక్క అక్షాంశం మరియు రేఖాంశ వివరాలను ఎన్‌సిఎస్ తెలిపింది. భూకంప తీవ్రంగా నాలుగుగా నమోదు కావడంతో పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు.

హైదరాబాద్ లో గత కొన్నేండ్లుగా తరుచూ భూ ప్రపంకనలు వస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బోరబండ ప్రాంతాల్లో ప్రతి ఏటా భూమి కంపిస్తోంది. వర్షాకాలం సీజన్ లో ఇలా ఎక్కువగా జరుగుతోంది. భూ ప్రకంపనలు తరుచూ వస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కు భూకంపాలు వచ్చే ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతుండగా.. వరుసగా నమోదవుతున్న ప్రకంపనలు ఆందోళన కల్గిస్తున్నాయి.