అమరావతిలో రూ.100 కోట్లతో వరల్డ్ క్లాస్ లైబ్రరీ
posted on Oct 22, 2025 9:36PM
.webp)
దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ ముందుకు రావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు.దుబాయ్ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీలో, “జీరో పావర్టీ” లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పీఎన్సీ మీనన్‌కు సీఎం వివరించారు.
అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానులలో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు.రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని సీఎం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం సరైన గమ్యస్థానమని పేర్కొన్నారు.తదుపరి మూడు సంవత్సరాల్లో అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలు పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నంలో గూగుల్ డేటా–ఏఐ హబ్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.