ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీయే బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రైపది కుర్ము నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు తన నామినేషన్ పత్రాలు ధాఖలు చేశారు. ద్రౌపది కుర్ము నామినేషన్ దాఖలు కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేబినెట్ మంత్రులు, ఎన్డీయే కూటమి పార్టీల ప్రతినిథులు, ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు నిస్తున్న పార్టీల ప్రతినిధులు. హాజరయ్యారు.

ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామపత్రాలను ఆమె దాఖలు చేశారు.అంతకు ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.   ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి   వైపీసీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నామినేషన్‌ కార్యక్రమానికి వైసీపీ  ప్రతినిథులుగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్ సభ సభ్యుడు నేత మిథున్‌ రెడ్డి హాజరయ్యారు.

నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందుగా అంటే గురువారమే ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒడిశాలోని బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న   ద్రౌపది ముర్ము జన్మించారు. టీచర్‌గా పనిచేసిన ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. కార్యకర్త నుంచి జాతీయ కమిటీలో చోటు పొందే స్థాయికి ఎదిగారు. ఒడిశాలో 2000-2002 మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 29తో గడువు ముగియనుంది. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు.