హుస్సేన్‌.. ఇంత డ్రామా అవ‌స‌ర‌మా?

క్లాస్ ఫ‌స్ట్ రాలేదు, ఉద్యోగంలో ప్రమో ష‌న్ రాలేదు, పోనీ ఊరికేమైనా ఘ‌న‌ కార్యం చేశాడా అంటే అదీ లేదు. కానీ హుస్సేన్ని మాత్రం లెబ‌నీయులు హీరో అనే అంటున్నారు. కార‌ణం అత‌ ను త‌న బ్యాంక్ అకౌంట్లో కొంత డ‌బ్బు తీసుకోవ‌డానికి నానా హ‌డావుడీ చేయాల్సి వ‌చ్చింది. చాలామంది భ‌య‌ప‌డ్డారు కూడా. సినిమా క్రైమ్ సీన్స్‌ని త‌ల‌పిస్తుంది. 

ఈమ‌ధ్య‌నే ఒక‌రోజు బ‌స్సాం అల్‌-షేక్ హుస్పేన్ అనే వ్య‌క్తి లెబ‌నాన్ బీరూట్‌కి చెందిన హామ్రా లో ఒక బ్యాంక్ కి వెళ్లాడు. అంద‌రూ డ‌బ్బులు తీసుకోవ‌ డానికి వెళ్ల‌న‌ట్టే వెళ్ల‌లేదు. చేతిలో ఏకం గా షాట్ గ‌న్ ప‌ట్టుకుని మ‌రీ వెళ్లాడు. లోప‌లికి వెళ్ల‌గానే అక్క‌ డున్న వారిని బెదిరించాడు. అంతే కాదు ఒక రౌండ్ కాల్పులూ జ‌రిపేడు. అయితే అక్క‌డున్న‌వారికేమీ కాకుండానే చేశాడా ప‌ని. నిజానికి అత‌ను బ్యాంక్‌ను మ‌రీ దోపిడీ చేసి పోవాల‌ని దొంగ‌లా చొర‌బ‌డ‌లేదుట‌. అత‌ని అకౌంట్‌లోంచి కొంత డ‌బ్బు తీసు కోవడానికే వ‌చ్చాన‌ని తీరిగ్గా చెప్పి డ‌బ్బు తీసుకున్నాడు. 

బీరూట్ ఫెడ‌ర‌ల్ బ్యాంక్ అనే బ్యాంక్‌లో హుస్సేన్ అకౌంట్‌లో సుమారు 1.67 కోట్లు డ‌బ్బు ఉంది. అందులోంచి రూ.7,96 లక్ష‌లు తీసుకోవాల‌ని వెళ్లాడు. కానీ బ్యాంక్ వారు అంత మొత్తం ఒక్క‌సారిగా ఇవ్వ‌డానికి అంగీక‌రించిన‌ట్టు లేదు. అత‌ను అడిగాడు, ప్రాధేయ‌ప‌డ్డాడు. త‌న తండ్రి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్నాడు. ఆయ‌న మందులు, ఆస్ప‌త్రి బిల్లు క‌ట్ట‌డానికి చేతిలో చిల్లి గవ్వ లేదు, ఇపుడు బ్యాంక్ నుంచే తీసి ఇవ్వాల‌ని వేడుకున్నాడు. బ‌హుశా బ్యాంక్‌వారు తిర‌స్క‌రించి ఉంటారు. అత‌గాడికి కోపం వ‌చ్చి ఓ ప‌దిమందిని షాట్‌గ‌న్ చూపించి డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాన‌ని బెదిరించాడు. అంతే బ్యాంక్‌వారు భ‌య‌ప‌డి ఆయ‌న అడిగింది మూట‌గ‌ట్టి మ‌రీ ఇచ్చారు. వాస్త‌వానికి లెబ‌నాన్‌లో ఆర్ధికప‌రిస్థితులు ఈ మ‌ధ్య‌కాలం ఊహించ‌ని విధంగా మార్పు చెందాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

హుస్సేన్ న‌వ్వుతూ అవి తీసుకుని సిగెరెట్ వెలిగించుకుని మ‌రీ బ‌య‌ట‌కి వ‌చ్చాడు. కానీ మెట్లు దిగ్గానే పోలీసులు ఎదుర య్యారు. కానీ హుస్సేన్ సినిమాల్లోలా పారిపోలేదు.  వాళ్ల‌ద‌గ్గ‌రికే వెళ్లి లొంగ‌పోయాడు.  ఇంత ప‌నిచేసేవేంద్రా భ‌య్‌.. అంటూ. బేడీలే వేసారు. అయ్యా నా ప‌రిస్థితిల్లో ఎవ‌రున్నా ఇంతే ఆవేశ‌ప‌డ‌తార‌ని అన్నాడు హుస్సేన్. అస‌లే పోలీసులు, అత‌డి మాట ల్ని అస్స‌లు న‌మ్మ‌లేదు. పైగా ఇప్ప‌టికే ఒక‌సారి ఇలాంటి దోపిడీ జ‌రిగింద‌ని ఇత‌న్ని క‌ట్ట‌డి చేయ‌క‌పోతే మ‌రీ సంఖ్య పెంచు తాడ‌ని భ‌య‌ప‌డే పోలీసులు అరెస్టు చేశార‌ట‌. ట్విస్ట్ ఏమిటంటే,  హుస్సేన్ ధైర్య‌సాహ‌సా ల‌కు బీరూట్ ప్ర‌జ‌లు మాత్రం అత‌న్ని హీరోగానే పిలుస్తున్నారు.