హలో అనొద్దు.. వందే మాతరం అనాలి.. ప్రభుత్వాధికారులకు మహా సర్కార్ ఆదేశం!

మహా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఫోన్ లో హలో అని కాదు.. వందే మాతరం అనాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వాధికారులందరూ సోమవారం (ఆగస్టు 15) నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకూ తమకు ఫోన్ వస్తే హలో అంటూ ఆన్సర్ చేయకూడదనీ, వందే మాతరం అంటూ ఆన్సర్ చేయాలని మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు.

ప్రస్తుతం ఈ ఆ దేశాలను ఆయన మౌఖికంగానే ఇచ్చారు. కానీ అధికారిక ఉత్తర్వులు ఈ నెల 18లోగా జారీ చేస్తామని ప్రకటించారు. అధికారులందరూ ఈ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మోడీ ఘర్ ఘర్ తిరంగా పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.