హలో.. మా వాళ్లు క‌నిపించారా..!

ఇప్పుడే వ‌స్తాన‌ని చెప్పి వెళ్లిన పిల్లాడి కోసం త‌ల్లి గుమ్మంలోనే ఎదురుచూస్తుంటుంది.  స‌ముద్రం మీద‌కి వెళ్లిన త‌న మ‌గ‌డి కోసం ఓ మ‌త్స్య‌కారుల కుటుంబంలో కోడ‌లు అలా సంద్రంవేపే చూస్తుంటుంది. వాళ్లు ఇప్పుడో, అప్పుడో రావ‌చ్చునేమో. కానీ ఏ భూకంప‌మో అమాంతం మింగేస్తే మిగిలిన ఒక్క‌రిద్ద‌రూ ఎదుచూ స్తూనే వుంటారు. ఓదార్చ‌డానికి మాట‌లు స‌రిపోవు. 

వాళ్లు తిరిగిరార‌ని చూచాయిగా తెల‌సినా ఏమో భ‌గ‌వంతుడు వెనక్కి పంపుతాడేమోన‌న్న పిచ్చి ఆశ క‌న్నీ టిని అడ్డుకుంటుంది. మీరు చూస్తున్న ఫోటోలో ఆ బుజ్జి కుక్క‌పిల్ల ఏదో తిన‌డానికో, లాక్కుపోవడాని కో అక్క‌డ లేదు. త‌న‌ను పెంచుకున్న‌వారి కోసం వేచి వుంది! అవును మొన్న‌టి ఆఫ్ఘ‌న్ భూకంపంలో కూలి పోయిన ఇళ్ల మ‌ధ్య అలా దిగులుగా అలా  చూస్తూ, వెతుకుతోంది.  దానికి మాట‌లు రావు, దాన్ని ఎవ‌రు ఓదార్చాలి? అస‌లీ ప్ర‌కృతి వైప‌రీత్యాలు జీవితంలో వూహించ‌ని మ‌లుపు ఇస్తుంటాయి. 

పిల్ల‌ల‌తో స‌మానంగా పెంచుకున్న కుక్క‌పిల్ల మ‌రి భూకంపం స‌మ‌యంలో ఎలా త‌ప్పించుకుందో తెలి య‌దు. ఇది గ‌యాన్ పాక్తికాలోని ఒచికీ అనే గ్రామంలో జ‌రిగింది.  కానీ త‌న‌ను ఇన్నాళ్లూ పెంచిన కుటుం బం మొత్తం  ఆ దుర్ఘ‌ట‌న‌లో ప్రాణం విడిచారు.

ఈ బుజ్జిది తెగ బాధ‌ప‌డుతోంది. ప్ర‌తీ నిమిషం అలా కూలి పోయిన గోడ‌ల మ‌ధ్య తిరుగుతూ, ఒక్కింత  విశ్రాంతి తీసు కుంటూందిట‌!  ట్విట‌ర్‌లో దాని ప‌ట్ల జాలి వెల్లువెత్తుతోంది. చుట్టుప‌క్క‌ల‌వారే  దాన్ని త‌మ ఇళ్ల‌కి  తీసికెళ్లి పాలు ప‌డుతున్నారు. దాన్ని పెంచుకోవా ల‌నే అనుకుంటున్నారు.