సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే ఈ పనులు చేయండి..!

సెల్ఫ్ కాన్పిడెన్స్.. ఏ పనిలో అయినా విజయం సాధించడానికి మొదటి సూత్రం ఇదే..  ఒక వక్తికి తన మీద తనకు స్పష్టమైన నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయాన్ని చాలా సులువుగా సాధించగలుగుతాడు. అయితే ఈ సెల్ఫ్ కాన్పిడెన్స్ అనేది అనుకోగానే వచ్చేది.  ఇది జీవితంలో అలవాట్ల ద్వారా, వ్యక్తిత్వం ద్వారా ఏర్పడేది.  కానీ కొన్ని పనులు చేయడం ద్వారా ప్రతి వ్యక్తి తమ సెల్ఫ్ కాన్పిడెన్స్ ను పెంచుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే..


పాజిటివ్ ఆలోచనలు..


మంచి అయినా, చెడు అయినా మొదట ఆలోచనలే మనిషి మీద ప్రభావం చూపిస్తాయి.  పాజిటివ్ ఆలోచనలు ఉన్నవారికి వారి జీవితంలో తాము చేసే పనులలో కూడా పాజిటివ్ వైఖరి ఉంటుంది. తమ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా వారి ఆలోచనలే ప్రేరేపిస్తాయి. సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి.


లక్ష్యాలు..

పెద్ద  పెద్ద లక్ష్యాలు నిర్థేశించుకుంటేనే గొప్పవాళ్లు కాగలం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.  కొందరు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తుంటారు. అయితే గొప్ప కలలు కనడంలో, గొప్ప స్థాయికి వెళ్లాలని అనుకోవడంలో తప్పు లేదు.. కానీ చిన్న చిన్న లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని సాధిస్తూ వెళితే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ఆరోగ్యం..

ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా సరే లక్ష్యాలు సాధించాల్సిందే.. అనుకున్న పనులు చేయాల్సిందే అనే మొండితనం ఎప్పటికైనా తీవ్ర నష్టం కలిగిస్తుంది.  అందుకే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి.  ఆరోగ్యం బాగుంటే ఎంత కష్టమైన పనులైనా ఉత్సాహంగా చేయగలుగుతారు.


నేర్చుకోవాలి..


అంతా తెలుసు అనేది అహంకారం అవుతుంది.  ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకున్నప్పుడే ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. విషయాన్ని కూడా ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇది లక్ష్యాల పట్ల ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది.


బలహీనతలు..


బలహీనతలు కప్పిపుచ్చుకోవడం చాలా మంది చేసే పని. కానీ బలహీనతలపై దృష్టి పెట్టాలి. వాటిని అధిగమించాలి. అలాగే బలాలను కూడా గుర్తు  చేసుకోవాలి.  బలాల ద్వారా సాధించిన విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.


ఓటమి..

జీవితంలో ఓటమి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదురవుతుంది.  విజయమే కావాలి అనే మెంటాలిటీ మనిషిని సెక్యురిటీ జోన్ లో ఉంచుతుంది.  కానీ ఓటమిని కూడా అంగీకరించగలిగేవారికి జీవితంలో  కాన్పిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ప్రతి వైఫల్యం గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.  వ్యక్తిత్వ పరంగా బలంగా మార్చుతుంది.


పరిచయాలు..


సెల్ఫ్ కాన్సిడెన్స్ మెరుగ్గా ఉండాలంటే నెగిటివ్ గా ఆలోచించకుండా ఉండటమే కాదు.. నెగిటివ్ మాటలు మాట్లాడే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి.  నెగిటివ్ గా మాట్లాడేవారు ప్రతి ప్రయత్నంలో వెనక్కు లాగే మాటలే మాట్లాడతారు.  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు.


భయం..


దేనికీ భయపడకూడదు. సమస్యలు ఏవైనా వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని పెంచుకోవాలి.   ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

                                     *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu