విజయకాంత్‌కి సీరియస్!
posted on Jul 10, 2014 12:08PM

ప్రముఖ తమిళ కథానాయకుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం సీరియస్‌గా వున్నట్టు తెలుస్తోంది. ఆయన తీవ్రమైన ఛాతీనొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బుధవారం పార్టీకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్న ఆయనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సి్వ్ కేర్‌లో వుంచి ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. భారీ పర్సనాలిటీ అయిన విజయకాంత్ గడచిన ఎన్నికల కోసం ఎంతో శ్రమించారని, ఎంతమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికలలో పనిచేశారని, దానివల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని ఆయన సహచరులు చెబుతున్నారు. విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తమ ‘కెప్టెన్’ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావాల్సిన అవసరం లేదని, విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని విజయకాంత్ సన్నిహితులు చెబుతున్నారు.