డింపుల్ హయతిపై కేసు నమోదు...ఎందుకంటే?

 

టాలీవుడ్ నటి డింపుల్ హయతి మరొకసారి  తెరమీదకి వచ్చారు.. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే హాయతి ఇప్పుడు పనిమనిషి వ్యవహారంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.. డింపుల్ హయతితో పాటు ఆమె భర్త పైన ఇంట్లో పని చేస్తున్న లేడీ ఫిర్యాదు చేసింది ..దీనిపైన ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ..ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. 

గత కొన్న రోజుల నుంచి డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సా కి చెందిన ప్రియాంక పనిచేస్తున్నారు. ఆమె ఇంట్లో ఉన్న కుక్క అరిచిందని చెప్పి డింపుల్ భర్త పనిమనిషి పైన చేయి చేసుకున్నాడు.. ఆ తర్వాత డింపుల్ హయతి కూడా తీవ్ర స్థాయిలో చిత్ర హింసలకు గురిచేసింది.. అక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు. అయితే జరుగుతున్న సంఘటనను షూట్ చేసేందుకు పనిమనిషి ప్రయత్నం చేసింది.

పనిమనిషి ఫోన్ తీసుకొని కింద పడేశారు ..ఆ తర్వాత ఆమె బట్టలు చింపి షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు ..డింపుల్ దంపతుల నుంచి తప్పించుకొంది. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయతి నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడిదనినా చెప్పుల విలువ కాదు నీ బతుకు అంటూ అకారణం గా దూషించడంతో పాటు.. దాడి కూడా చేసినట్లుగా పనిమనిషి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు హీరోయిన్ డింపుల్ హయతీ తో పాటు ఆమె భర్త  మీద క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ అనే యువతి షేక్‌పేటలోని వెస్ట్‌వుడ్ అపార్టు మెంట్స్‌లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. అయితే, డింపుల్, ఆమె భర్త డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వ కుండా హింసుస్తు న్నారని ప్రియాంక తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని,అంతేకాక తనను నగ్నంగా మార్చి కొట్టేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అదేవిధంగా.. జీతం విషయంలోనూ వారు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రియాంక తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయతీ, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

తాను పనిచేసేపటికి డబ్బులు ఇవ్వకుండా తన ఫోటోలు వీడియోలు తీసి ఇబ్బందులకు గురి చేస్తారని పనిమనిషి పోలీసులకు చెప్పింది... మరోవైపు హాయతి ఉంటున్న ఫ్లాట్ ఎదుట ప్రియాంకతో పాటు మరొక పనిమనిషి కలిసి ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి వారిద్దరికీ సర్ది చెప్పి తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు.. పోలీసులు డింపుల్ హయతి మరియు ఆమె భర్తపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu