డిజిట‌ల్ బుక్ ఫార్ములా... జగన్‌కే రివ‌ర్స్

 

జ‌గ‌న్‌కి ఎంత టైం బ్యాడో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క కాబోలు. అదేంటంటే ఆయ‌న డిజిట‌ల్ బుక్ ఓపెన్ చేసి.. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వేధిస్తే.. మ‌రీ ముఖ్యంగా మీరు కూట‌మి ప్ర‌భుత్వం నుంచి అన‌వ‌స‌ర కేసులు ఇత‌ర‌త్రా వేధింపుల‌కు లోనైతే.. మిమ్మ‌ల్ని ఎవ‌రు వేధిస్తున్నారు.. అన్న పూర్తి వివ‌రాల‌ను మీరు మ‌న డిజిట‌ల్ బుక్ లోకి ఎక్కించాలి.. ఆపై మ‌నం అధికారంలోకి వ‌చ్చాక‌.. వారు స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల దాగి ఉన్నా వ‌ద‌ల‌కుండా వెంటాడి మ‌రీ రివేంజ్ తీర్చుకుందాం. ఇదీ జ‌గ‌న్ తీస్కొచ్చిన డిజిట‌ల్ బుక్ ప్ర‌ధానోద్దేశం. ఇది చూస్తుంటే రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తోంది..

మాములుగా అయితే ఈ డిజిట‌ల్ బుక్ కి ప్ర‌త్య‌ర్ధి  పార్టీలు, మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ వారిపై కంప్ల‌యింట్లు రావాలి. కానీ ఎంత చిత్ర‌మంటే చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో వైసీపీ  కార్య‌క‌ర్త‌ల నుంచి మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కంప్ల‌యింట్లు రావ‌డంతో ఒక్క‌సారిగా  పార్టీ షాక‌య్యింది.

అస‌లు పార్టీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిందో అప్ప‌డు అర్ధ‌మైంద‌ట‌.. జ‌గ‌న్ కి. ఇక్క‌డ మ‌నం ఒక్క‌రే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా మ‌ద్యం కుంభ‌కోణం వంటి వాటి ద్వారా దోచుకుంటున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో మంచి వారు, స‌చ్చీలురు అనుకుంటూ వ‌చ్చార‌ట జ‌గ‌న్. కానీ వారు కూడా సేమ్ టూ సేమ్.. అదే ఫ్లో మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న‌కు అంత వ‌ర‌కూ అర్ధ‌మ‌య్యింది కాదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ ఓట‌మికి ప్ర‌ధాన  కార‌ణం వాలంటీర్లుగానే భావిస్తూ వ‌చ్చారు. అందుకే ఇటీవ‌ల ఒక స్ట్రాంగ్ డెసిష‌న్ తీస్కున్నారాయ‌న‌. ఒక వేళ మ‌నం అధికారంలోకి వ‌స్తే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి.. ఆపై కార్య‌క‌ర్త‌ల‌పైనే ఆధార ప‌డాల‌ని భావించిన జ‌గన్ కి డిజిట‌ల్ బుక్ ద్వారా ఈ విష‌యం తెలియ‌డంతో ఏం చేయాలో పాలు పోలేద‌ట‌.

మ‌హిళా మంత్రుల‌ని మ‌నం త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదని అంటారు ఫ్యాను పార్టీ వ‌ర్గాలు వారు.. రోజా ఆడుదాం ఆంధ్ర ద్వారా,  ర‌జ‌నీ స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మానులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల ద్వారా భారీగానే దోచుకున్న‌ట్టు స‌మాచారం. ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అడిగితే విడుద‌ల ర‌జ‌నీ గురించి, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత వెన‌కేసుకొచ్చారో ఏకంగా ఒక చిట్టా త‌యారు చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. 

అంత భారీగా ఉంటాయి ర‌జ‌నమ్మ లీల‌లు అంటారు ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలాంటి కొంద‌రు. స‌రే శ్రీదేవికంటే తాను డాక్ట‌ర్ అయితే ఆరోగ్య శాఖ త‌న‌కివ్వాల్సింది ర‌జ‌నీకిచ్చార‌నే అసూయ ఉండొచ్చ‌ని లైట్ తీస్కుంది పార్టీ అధిష్టానం. ఇప్పుడుగానీ అస‌లు విష‌యం అఫిషియ‌ల్ గా తెలిసి రాలేద‌ట జ‌గ‌న్ కి. అంత‌గా ఆమెపై ఫిర్యాదులు వెల్లువ‌ల అందుతున్నాయ‌ట‌.

ఇక రోజా అయితే టీటీడీ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టోకెన్లు అమ్మి సొమ్ము చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయ్. ఈ విష‌యంపై మా ద‌గ్గ‌ర బోలెడు ఆధారాలున్నాయంటారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.

ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో.. ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా సాగిన అవినీతి కాండకు జ‌గ‌న్ భారీ మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ లీలా మాత్రంగా వీట‌న్నిటి గురించి విన్న జ‌గ‌న్ వారి వారి ప్రాంతాల నుంచి ఆయా లీడ‌ర్ల‌ను త‌ర‌లించి ఇత‌ర ప్రాంతాల్లో పోటీ చేయించినా ఫ‌లితం లేకుండా  పోయింది.

ఇప్పుడు జ‌గ‌న్ కి మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతున్న విష‌యం ఏంటంటే.. తాను వీరి మాయ‌లో ప‌డిపోయి.. వారు తెర వెన‌క ఏం  చేస్తున్నారో అస్స‌లు ప‌ట్టించుకోలేక పోయాన‌ని తీవ్రంగా బాద ప‌డుతున్నార‌ట‌. ఆ మాట‌కొస్తే వాళ్ల‌ను నిల‌దీసే  ప‌రిస్థితి  కూడా లేదు. అందుకు రీజ‌న్.. తాను కూడా త‌లాపాపం తిలాపిడికెడు అన్న‌ట్టు.. త‌మ హ‌యాంలో చేసిన అవినీతి య‌జ్ఞంలో పీక‌లోతు మునిగి పోయి ఉండ‌ట‌మే.. అన్న‌ది అస‌లు విష‌యంగా తెలుస్తోంది. మ‌రి చూడాలి ర‌జ‌నీతో పాటు మ‌రి ఎంద‌రిపై డిజిటల్ బుక్ లో కంప్ల‌యింట్లు వ‌స్తాయో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu