తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే?
posted on Jul 25, 2025 9:31AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. మూమూలు రోజులలోనే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటిది శ్రావణమాసం అంటే ఇక చెప్పనే అవసరం లేదు.
శుక్రవారం (జులై 25) నుంచి శ్రావణ మాసం ఆరంభం కావడం, అందులోనూ తొలి రోజే శుక్రవారం కావడం, వారాంతం సమీపిస్తుండటంతో శుక్రవారం (జులై 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (జులై 24) శ్రీవారిని మొత్తం 68,800 మంది దర్శించుకున్నారు. వారిలో 22,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.