బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆపడంలో ఆ రెండు పార్టీల కుట్ర : భట్టి

 

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు తప్పక అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. ఢిల్లీలో మేము ధర్నా చేసిన రోజు బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ దాక్కున్నారు? బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్టబద్ధంగా చేయాల్సిన ప్రతి ప్రక్రియను మా ప్రభుత్వం పూర్తి చేసిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. 

సెప్టెంబర్‌ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటూ కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉంటే కులగణన ఎందుకు చేయలేదు? బీసీలు అమాయకులు కాదు... రిజర్వేషన్ల పెంపు ఎంత క్లిష్టమో వారికి తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాం” అని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ అన్నారు . 

బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది  బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని మహేష్‌ గౌడ్‌  నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని మహేష్‌ గౌడ్‌  చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu