ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా,  దేశ వ్యాప్తంగాసంచలనం సృష్టించిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐబొమ్మ రవి విచారణకువిచారణకు కోర్టు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోదనీ, ఆయన కస్టడీని పొడిగించాలనీ ఆ రివిజన్ పిటిషన్ లో పేర్కొన్నారు.  

ఐబొమ్మ రవిపై  నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు  ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి  కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.  మొత్తం నాలుగు కేసుల్లోనూ సమగ్రంగా విచారించాల్సి ఉందని, ఇందుకు గాను ఐదు రోజుల కస్టడీ అవసరమని పోలీసులు తమ రివిజన్ పిటిషన్ లో కోరారు.  ‘కుబేర’, ‘కిష్కింద పురి’, ‘తండేల్’, ‘హిట్’ వంటి భారీ చిత్రాల పైరసీకి సంబంధించి కీలక సమాచారాన్ని రవి నుంచి రాబట్టాల్సి ఉందని వివరించారు.  ఇందు కోసం అదనపు కస్టడీ అవసరమని పేర్కొన్నారు.

  పైరసీ చేసిన ఫైళ్ల సోర్స్ లు, రవి అందుకున్న టెక్నికల్ సహాయం, సర్వర్లు, విదేశీ ఐపీ అడ్రెసులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందన్న సైబర్ క్రైమ్ పోలీసులు, రవి నిర్వ హించిన నెట్‌వర్క్‌లో ఎంత మంది భాగస్వా ములు ఉన్నారు? సినిమాల డిజిటల్ కాపీలు ఎక్కడి నుండి తీసుకున్నారు? ఎలాంటి ఛానళ్ల ద్వారా పంపిణీ చేశారు? అనే విషయాలపై ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు.  కాగా పోలీసుల రివిజన్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu