బాలకృష్ణకు కరోనా పాజిటివ్

తెలుగుదేశం నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ  తెలంగాణాలో విస్త‌రిస్తోంది. శుక్ర‌వారం కొత్త‌గా 493కేసులు న‌మోద‌య్యాయి. గ‌డ‌చిన 24 గంట‌ల్లో  దేశంలో 29,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాటిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలంగాణా వైద‌్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

 వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లోనే 366 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 3,332 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులిటెన్‌‌లో వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. గురువారం 494 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

మరోవైపు..   నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది.  కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల కిందట బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

   తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని బాలయ్య సూచించారు. తాను త్వరలోనే కోలుకొని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానన్నారు. హరీశ్ రావు వేదికపై బాలయ్య పక్కన కూర్చున్నారు. కోవిడ్ వ్యాప్తి పెద్దగా లేకపోవడంతో ఎవరూ మాస్కులు ధరించలేదు. బాలయ్య కరోనా బారిన పడినట్లు తేలడంతో..   హరీశ్ రావుతోపాటు కేన్సర్ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒకింత టెన్షన్‌కు గురవుతున్నారు. మంత్రి హరీశ్ రావుకు గతంలోనే కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే.