కరోనా ఇక ముగిసిన అధ్యాయం!

గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అస్తవ్యస్థం చేసిన కరోనా మహమ్మరి ఇక ముగిసిన అధ్యాయమే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ధృవీకరించింది. చైనాలోని వూహాన్ లో మొదలైన కోవిడ్-19 ప్రపంచాన్ని కమ్మేసింది. లక్షలాది మంది  ఉసురు తీసేసింది.  మరి కొన్ని కోట్ల మంది కోవిడ్ అనంతర ఇబ్బందులతో ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఓ ప్రపంచానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఇక ఎంత మాత్రం పెండమిక్ కాదనీ, అది ఎండమిక్ స్టేజికి చేరందన్న చల్లని కబురు చెప్పింది.   ప్రపంచాన్ని గజగజలాడించినన కోవిడ్-19 కథ ముగిసినట్టే అని అధికారికంగా ప్రకటించింది.
‘కరోనా వైరస్ వెలుగు చూసిన రెండున్నరేళ్లకు మహమ్మారి పలాయనం చిత్తగించే సమయం ఆసన్నమైందనీ, ఇక కరోనా  ప్రాణాతక వైరస్ కాదని తేల్చేసింది. అంత మాత్రాన కరోనా పూర్తిగా అంతర్ధానమైపోయిందని కాదని వివరణ ఇచ్చింది. కరోనా మహమ్మారిక కారణంగా గత రెండున్నరేళ్లుగా   చీకటిగుహలో మగ్గిపోతున్నాం.  ఇప్పుడు ఆ మహమ్మారి ఎండమిక్ దశకు రావడంతో ఇప్పుడు ఆ చీకటి గుహ చివరిలో వెలుగు రేఖ కనిపిస్తోందని  డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది.  అయితే.. చీకటి గుహ  అవతలకు చేరుకుని వెలుగును పూర్తిగా అక్కున చేర్చుకోవడానికి మరింత సమయం పడుతుందని అంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని డబ్ల్యుహెచ్ ఓ   డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు.   కాగా.. కరోనా వైరస్ బలహీనం అయిందని అశోకా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ చెప్పారు.  తొలి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులను గౌతమ్ మీనన్ ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్ కు మన శరీరాలు అలవాటు పడ్డాయని, అందువల్ల ఇక ఈ వైరస్ ఇంకెంత మాత్రం ప్రాణాంతకం కాదని ఆయన వివరించారు.   కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్ల, 2 లక్షల 42 వేల 551 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్ సోకిన 65 లక్షల 40 వేల 339 మంది మరణించారు. కాగా భారతదేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల 45 లక్షల 72 వేల 243 కరోనా కేసులు నమోదయ్యాయి. 5 లక్షల 28 వేల 530 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు.