హామీలు ఇచ్చి, అమ‌లు మ‌రిచి!.. జగనన్న మాట త‌ప్పుడు.. మ‌డ‌మ తిప్పుడు..

ఎన్నికల సందర్భంగా ఇచ్చీ హామీలు అన్నీ అమలు చేయడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వనికీ సాధ్యంకాదు. కానీ, ఏవో కొన్ని ఉచితాలు తప్ప, ఇచ్చిన హామీలు ఏవీ, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి ఆడగా నిలిచే హామీలు ఏవీ  అమలు చేయని ఘనత మాత్రం నిస్సందేహంగా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. 

ప్రభుత్వ ఉద్యోగుల విషయమే తీసుకుంటే, 2019 ఎన్నికలకు ముందు ఆయన, సాధ్యా సాద్యాల గురించి క్షణమైనా ఆలోచించకుండా, సీపీఎస్ రద్దు చేస్తామని హమీ ఇచ్చారు. అదికూడా ఎప్పుడో కాదు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే సీపీఎస్’ను ఎత్తేసి మళ్ళీ పాత పెన్షన్ పద్దతిని తెస్తామని హమీ ఇచ్చేశారు. ఉద్యోగులు ఆశ పడ్డారు ... గుడ్డిగా ఓట్లు గుద్ది గెలిపించారు. అయినా, వారం పోయి వందవారాలు అయినా, సీపీఎస్ పోలేదు .. చివరకు ఆల్ ఇన్ వన్ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అబ్బే అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాం... సీపీఎస్ రద్దు సాధ్యంకాదని చావు కబురు చల్లగా చెప్పారు. 

ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసన సభలో అమరావతి రాజధాని అంటే ఓకే అన్నారు. రాజధాని బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుమారు 40 నిముషాలకు పైగా సాగిన ప్రసంగంలో  అధికార వికేంద్రీకరణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత  వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ముచ్చట తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనను, మూత కట్టి అటకెక్కించారు. నవ్యాంధ్ర ప్రదేశ్’ను రాజధాని లేని రాష్ట్రంగా త్రిశంకు స్వర్గంలో వెళ్లాడ దీశారు. 

ఇక అంచెల వారీ సంపూర్ణ మధ్య నిషేధం హామీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. సంపూర్ణ కాదు , పాక్షిక మధ్య నిషేధం కూడా మరో పాతికేళ్ళు వెనక్కి నేట్టేశారు. జగన రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, మరో 25 సంవత్సరాల పాటు, ఆంధ్ర ప్రజలు చచ్చినట్లు ప్రతి రోజు మందు తాగకే తప్పదు. చావకా తప్పదు. రానున్న 25 సంవత్సరాలలో మద్యం అమ్మకాల మీద  వచ్చే అదాయాన్ని పూచికత్తుగా పెట్టి జగనన్న అప్పు తెచ్చుకున్నారు. సో ... మరో రెండేళ్లలో ఈ ప్రభుత్వం పోయినా, జగన్ రెడ్డి జ్ఞాపకంగా నిత్య మధ్య విధానం కొనసాగుతూనే ఉంటుంది.మధ్య నిషేధం సంగతి దేవుడెరుగు, ప్రభుత్వమే మద్యం వ్యాపారంలో పీకలలోతు కూరుకుపోయింది. బడి పంతుళ్ల చేత మధ్యం అమ్మించే ‘ఎత్తు’కు ఎదిగిపోయింది.  

అలాగే, పోలవరం ప్రాజెక్టు, 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హమీ ఇచ్చారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్, అసెంబ్లీలో విపక్షాలను అవహేళన చేస్తూ 2021 డిసెంబర్ చివరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, జరిగింది ఏమిటో .. అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ వదిలిందో .. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత కూడా అక్కడే వుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు చాపచుట్టేసింది. 

అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినవి చేయక పోయినా, చెప్పనివి చాలా చేసింది ... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ళలో ఎప్పుడు పెంచని ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు జగన్ సర్కార్ పెంచింది. ఇలా, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు తప్పడం అలవాటుగా చేసుకుంది. అందుకే, రాష్ట్ర అభివృద్ది కోరుకునే ప్రతి ఒక్కరూ, ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు.