ఆర్‌ఎస్‌ఎస్ ను ఐసిస్ తో పోల్చిన ఆజాద్.. రాజ్యసభలో దుమారం..
posted on Mar 14, 2016 3:23PM

కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగుతోంది. ఆర్ఎస్ఎస్ ను ఐసిస్ ను పోలుస్తూ ఆజాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎలాగైతే ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తామో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను కూడా వ్యతిరేకిస్తాం. ఇస్లాం మతస్తులు తప్పు చేస్తే.. అది ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు తప్పు చేసినట్లే అని ఆజాద్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. దీనిపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ఆజాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐసిస్‌తో పోల్చి ఆజాద్ నోరు జారారని.. ఈ రకంగా ఆయన ఐసిస్ ను గౌరవించారని.. దీన్ని బట్టి వారి మనస్థత్వాలు ఏంటో అర్దమయిందని అన్నారు.
అయితే దీనికి ఆజాద్ మాత్రం తాను ఆర్‌ఎస్‌ఎస్ ను.. ఐసిస్ ను పోల్చి వ్యాఖ్యలు చేయలేదని.. కావాలంటే ఆ ప్రసంగానికి సంబంధించిన సీడీలను పరిశీలించాలని కోరారు.