Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోక్సో కేసులో బండి భగీరథ్‌కు కండీషన్డ్ బెయిల్.!
posted on: Jul 9, 2026 6:12PM

తెలంగాణో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో బెయిలు లభించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం(జులై 9) షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు నిందితుడు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
గత కొన్ని వారాలుగా చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు ఈ నిర్ణయం భారీ ఊరట ఇచ్చిందనేచెప్పాలి. మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
గురువారం (జులై 9) హైకోర్టులో బండి బగీరథ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫున హాజరైన న్యాయవాది నిందితుడు విద్యార్థి దశలోనే ఉన్నాడని, సుదీర్ఘ కాలంగా జైలులో ఉండటం వల్ల అతని విలువైన విద్యా సంవత్సరం, చదువు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని వాదించారు. గతంలో అతని బీబీఏ పరీక్షల నిమిత్తం హైకోర్టు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకుందని, ఈ సమయంలో నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయనీ, అలాగే ఆధారాలను తారుమారు చేసే ముప్పు ఉందని వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు బండి బగీరథకు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది.
Bandi Bhagirath Bail, Bandi Sanjay Son, POCSO Case Hyderabad, Telangana High Court, Justice K Sujana, Pet Basheerabad Police






