గంజాయి వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
posted on Oct 22, 2025 9:20PM

అచ్చం సినిమాలో మాదిరిగానే తెలంగాణ పోలీసులు ఈగల్ టీమ్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి గంజాయి ఉన్న ఓ వాహనాన్ని రాత్రంతా ఫాలో చేస్తూ చివరకు చెక్ పెట్టి... నిందితు డిన్ని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు...
సినిమాలో లాగా తెలంగాణ పోలీ సులు చేసిన చేజింగ్ సీన్స్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. గంజాయి భారీ ఎత్తున సరఫరా చేస్తున్నట్లు గా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో వెంటనే ఖమ్మం జిల్లా నార్కోటిక్ పోలీసులు అప్రమత్తమై ఈగల్ టీం తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వ హిస్తూ... ఆంధ్ర-- ఒరిస్సా సరిహద్దు ప్రాంతా ల్లో నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలోనే అధికా రులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా పోలీ సుల తనిఖీల్లో నుంచి ఈజీగా తప్పించుకోవచ్చునని నిందితులు భావించారు. ఈ క్రమంలోనే 21వ తేదీన మధ్య రాత్రి అతిపెద్ద ట్రక్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్‌లో గంజాయి పెట్టుకొని రవాణా చేస్తు న్నారు. అక్కడ వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారు లకు ఒక వాహనం అనుమానంగా కనిపించింది.
హెవీ వాహనం ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా నుండి ఉత్తరప్రదేశ్‌లో వారణాసికి బయలుదేరినట్లుగా నిర్ధారణ అయింది. అయితే వీరు గంజా యిని తీసుకొని తెలంగాణ గుండా ప్రయాణం చేస్తు న్నారు. తెలంగాణ పోలీసులు రాత్రం తా హెవీ వాహ నాన్ని చేజ్ చేస్తున్నారు... పోలీసులు తమను చేజ్ చేస్తున్నారని తెలుసుకున్న ఈ ముగ్గురు నింది తులు వాహనం దారి మళ్ళించి... వేరే దారిలో వెళ్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనేతెలంగాణ పోలీసులు ట్రాకింగ్ ద్వారా రాంచి ఎన్సీబీ కి సమాచారం ఇచ్చింది.
రాంచి ఎన్సీబి అధికారులు వెంటనే అప్రమత్తమై స్మగ్లర్లు వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసి.. చివరకు జార్ఖండ్ లోని రాంచి-రూర్కెలా రోడ్డులోని సిమ్ దేగా వద్ద 10 టైర్ల హెవీ గూడ్స్ వాహనాన్ని అడ్డగిం చారు. అనం తరం అధికారులు హర్యానాకు చెందిన నసిమ్ కమ్రుద్దీన్ (30) ను పట్టుకోగా హర్యానాకు చెందిన ముష్తాక్ ఖాన్, ఆరిఫ్ ఈ ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నివసిస్తున్నారు.. అధికారులు నసీమ్ కమ్రుద్దీన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 500 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.