మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి : సీఎం రేవంత్ రెడ్డి

 

తెలంగాణ పోలీసు శాఖ చర్యలతో మవోయిస్టు, ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్​‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. 

ఆజ్జాతంలో ఉన్న మవోయిస్టులు లోంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొందరు మవోయిస్టు అగ్రనేతలు కొందరు లొంగిపోయారని అలాగే మిగిలినవారు కుడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి తెలంగాణ పునర్నిర్మాణనికి తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని సీఎం తెలిపారు. 

మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu