ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే వాళ్లకు అదే ఆఖరి రోజు : సీఎం చంద్రబాబు
posted on Oct 21, 2025 11:14AM

ఏపీలో పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తుమన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని 6 ఏపీఎస్పీ బెటాలియన్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కల్తీ మద్యంపై సీఎం కీలక వ్యాఖ్యలు..ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారని పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.
వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలి కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదు. సీసీ కెమోరాలు, డ్రోన్లు, గూగుల్ టేకౌట్‌లను ఉపయెగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.
పోలీసు సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పనిచేస్తున్నారంటూ పోలీసులను ప్రశంసించారు. ఈ ఏడాది విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని,. వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్ , డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.