ద ఫ్యామిలీ మేన్ బాబు
posted on Oct 21, 2025 10:21AM
.webp)
చంద్రబాబు 4. 0 అంటే అందరూ అది పరిపాలనలో అనుకుంటారు. కానీ, ఆయన పరిపాలన ఇప్పుడేంటి ఎప్పుడో అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలే లేవు. ఆయన ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో.. అడ్మినిస్ట్రేషన్ లో బ్రాండెడ్ సీఎంగా ఉన్నారు. ఆ మాటకొస్తే.. సీఈవో ఆఫ్ ద స్టేట్ అనే బిరిదు ఆయనకు తాను తొలి సారి సీఎం అయినప్పటి నుంచీ ఉంది.
బాబు మారిందని చెబుతోంది.. ఆయన యాటిట్యూడ్ కి సంబంధించినది. ఇటు కుటుంబం కావచ్చు, అటు ప్రజల మధ్య ఆయన తీరు తెన్నులు కావచ్చు.. వీటి విషయంలో విశేషమైన మార్పు రావడమే.. బాబు 4. 0 స్పెషల్
మీరు భువనేశ్వరిగానీ, లోకేష్ గానీ మాట్లాడేటపుడు బాబు గురించి వారేమంటారో గుర్తించారా? నా బాల్యంలో కావచ్చు నా ఎదుగుదలలో కావచ్చు డాడీ పెద్దగా ఉండేవారు కాదని అంటారాయన. ఒక పొలిటీషియన్ గా మరీ ముఖ్యంగా ఒక సీఎంగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆల్వేస్ బిజీయే. ఇక నారా భువనేశ్వరీ మాత అన్నమాటలను బట్టీ చూస్తే తన మొత్తం ఫ్యామిలీ లైఫ్ లో బాబు తీసిచ్చింది ఒకే ఒక్క చీరగా చెప్పుకుని బాధ పడ్డారామె.
లోకేష్ కొరత తీరేలా తన కేబినేట్లో మంత్రిని చేసి.. ఇక్కడ కావచ్చు, ఏదైనా విదేశాలకు తీసుకెళ్లడం కావచ్చు.. చేస్తూ కొడుకు ముచ్చట తీర్చుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న మోడీ కర్నులు జీఎస్టీ సభలో కూడా తన తనయుడ్ని అది పనిగా దగ్గరకు తీస్కుని మోడీకి మొమెంటో ఇప్పించారు చంద్రబాబు. అది కదా తండ్రి కొడుకుల వాత్సల్యం అనిపించేశారు. ఈ మధ్య కాలంలో ఒక చేనేత వస్త్ర ప్రదర్శన శాలకు వెళ్లినపుడు తన భార్య కోసం ప్రత్యేకించీ ఒక చీర కొన్నారు చంద్రబాబు. మా ఆవిడ నేనే చీర కొనివ్వలేదని కంప్లయింట్ చేస్తోందీ.. ఆమె కోసం ఒక మంచి చీర ఇవ్వండయ్యా అంటూ అడిగి మరీ ఆ లోటు తీర్చే యత్నం చేశారు.
అలాంటి చంద్రబాబుకు పండగలు పబ్బాలు కూడా.. ఫ్యామిలీతో కలసి ఉండేవి కావు. ఎప్పుడూ ఏదో ఒక బిజీ బిజీ. అలాంటిది ఇప్పుడు తన కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయిస్తున్న దృశ్యానికి ఇదిగో ఇదే అసలైన సాక్ష్యం. గృహమే కదా స్వర్గ సీమ అన్నట్టుగా తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకోవడం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు బొత్తిగా మారిపోయారోచ్ అంటూ ఒకటే కామెంట్లు పేలుతున్నాయ్ కొందరి సోషల్ మీడియా గోడల మీద. ఆ మాటకొస్తే.. బాబు ఫోర్ పాయింట్ ఓ అంటే ఇదేనంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు కొందరు నెటిజన్లు.